దెయ్యాలు ఉన్నాయట జాగ్రత్త.. వీడియో..

దెయ్యాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అంతేకాదు అవి గొడవ కూడా పడుతున్నాయి. మీరు విన్నది అక్షరాల నిజం..దెయ్యాలు గొడవలు కూడా పడుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వింత ఆకారాల నగల షాపులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. దాన్ని చూసిన ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే.. రెండు తెల్లని ఆకారాలు గొడవ పడుతున్నట్లు వీడియో లో కనిపించాయి. అది చూసిన షాప్ యజమాని ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.. ఆ వీడియో ను సోషల్ మీడియాలో చేశాడు అది కాస్త వైరల్ అవుతుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి  మెయిన్ రోడ్డులోని ఓ నగల దుకాణంలో దెయ్యాలున్నాయన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. డిసెంబర్ 25వ తేదీ రాత్రి సమయంలో రెండు వింత ఆకారాల నగల షాపులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. మొబైల్ యాప్ లో సీసీ ఫుటేజ్ ను చూసిన షాపు యజమాని షాక్ కు గురయ్యాడు. అందుకు సంబంధిచిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment