రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్..ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం సినిమాలో వాయిదా పడుతున్న అంటూ వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయం పై అభిమానులు తీవ్రంగా చర్చలు చేశారు.రెండు సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఉన్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఈ సినిమాలు విడుదల చేస్తున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి.

అయితే తాజాగా “రాధేశ్యామ్” సినిమా విడుదల పై మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా “రాధేశ్యామ్” సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది రాధే శ్యామ్ టీం. ఈ పోస్టర్ లో జనవరి 14న సినిమా అంటూ స్పష్టం చేశారు “రాధేశ్యామ్” మూవీ మేకర్స్.. మొత్తానికి ఈ సినిమాలు సంక్రాంతికి సందడి చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఎ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..

Leave a Comment