భోళా శంకర్ న్యూయర్ ట్రీట్ అదిరిపొయింది..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమా లతో ఫుల్ బిజిగా ఉన్న సంగతి తెలిసిందే..మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ ఏడాది సినిమా విడుదల కానుండగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్..స్వాగ్ ఆఫ్ బోలా అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. మెగాస్టార్ స్టైలిష్ హెయిర్‌డోతో పోస్టర్‌లో కనువిందు చేశాడు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరుతో రొమాన్స్ చేయనుంది. కీర్తి సురేష్  మెగాస్టార్ కు చెల్లెలు 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ విడుదల చేశారు. అలాగే దీనితో పాటు ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ షూటింగ్‌తో కూడా చిరు బిజీగా ఉన్నాడు. ఇక శివ కొరటాల దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్దంగా ఉంది.

Leave a Comment