రాధేశ్యామ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంట గా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్.. చివరి దశ షూటింగ్ పనులను బిజిగా జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను భారీగా పెంచుకునేందుకు పనికొస్తుందని అర్థమవుతుంది. అంతలా మంచి టాక్ ను అందుకున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదల అయ్యింది.ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్ర పోషిస్తున్నట్టు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.మరో వైపు  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాట్లు జరుగుతుంటే మరో పక్క చడీ చప్పుడూ లేకుండా ఇలా కృష్ణంరాజు కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది చిత్ర బృందం. అందాల భామ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ పాటలు చార్ట్ బస్టర్స్ లో టాప్ పొజిషన్ లో నిలుస్తున్నాయి.. జనవరి 14 సినిమా విడుదల కానుంది.

Leave a Comment