‘నువ్వునాకు నచ్చావ్’ పింకీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

కామెడీ ప్రధానంగా వచ్చిన తెలుగు సినిమాలు దాదాపు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కామెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని రోజుల పాటు సెంటిమెంట్ సినిమాలకే పరిమితమైన విక్టరీ వెంకటేశ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో కామెడీ కూడా పండించగలడని నిరూపించాడు. అప్పటి వరకు సినిమాలకు మాటలు రాసిన త్రివిక్రమ్ ఈ సినిమాకు కూడా రాశాడు. ఈ సినిమాలో డైలాగ్ లే హైలెట్ గా నిలవడంతో త్రివిక్రమ్ కు కూడా మంచి పేరు వచ్చింది. అటు ఆర్తిఅగర్వాల్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. ఇలా ప్రత్యేకతలు సాధించిన ఈ సినిమాలో మరో చెప్పుకోదగ్గ పాత్ర పేరు పింకీ. హీరోయిన్ చెల్లెలుగా పింకీ పాత్రలో చేసిన అమ్మాయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

పింపీ అసలు పేరు సుదీప. అంతకుముందు కూడా సుదీప సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా సక్సెక్ కావడంతో సుదీపకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సక్సెస్ సినిమాల్లో నటించింది. అయితే కొన్ని రోజుల పాటు ఇలా సైడ్ రోల్ లో నటించిన సుదీప ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. అందుకో కారణం ఉంది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కెరీర్ పై దృష్టి పెట్టింది సుదీప. అలా ఏంబీఏ వరకు చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత శ్రీరంగనాథ్ అనే సాప్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వివాహం అయిన తరువాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే పెళ్లయిన కొన్ని రోజుల తరువాత సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపకపోయినా సీరియళ్లలో నటిస్తూ వచ్చింది. జెమినీ, మా టీవీల్లో ప్రసారమయ్యేచాలా సీరియళ్లలో సుధీపను చూడొచ్చు.

సినిమాల్లో అవకాశం రానివారు బుల్లితెరపై నటిస్తున్న విషయం తెలిసిందే. సుదీప కూడా టీవీ సీరియల్ పై వెళ్లి నటిస్తోంది. ప్రస్తుతం సుదీప సీరియళ్లలో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ తో హాయిగా ఉంది. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు హీరోయిన్ కావాలనుకుంటారు. కానీ సుదీప ఎప్పుడూ హీరోయిన్ కావాలన్న ఆశ లేదు. అయతే సినిమాల్లో సైడ్ రోల్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉండేది. ప్రస్తుతం సీరియళ్లకే పరిమితమైన సుదీప సినిమాల్లో అవకాశం వస్తే చేస్తానంటోంది.

Leave a Comment