‘హ్యాపీడేస్’ అప్పు ఎలా మారిపోయిందో తెలుసా..?

కాలేజీ స్నేహమే ప్రధానంగా వచ్చిన సినిమా హ్యపీ డేస్. 2007లో వచ్చిన ఈ సినిమా కాలేజ్ యూత్ ను బాగా ఆకర్షించింది. ఇందులోని ఫేవరేల్ సాంగ్ ఇప్పటికీ కళాశాలల్లో మారుమోగుతూ ఉంటుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘హ్యాపీడేస్’లో అందరూ కొత్త వాళ్లే. ఈ సినిమాతో వరుణ్ సందేశ్, తమన్నా తదితర నటులు పరిచయం అయ్యారు. ఐదగురు ఫ్రెండ్స్ కాలేజీ లైఫ్ గురించి ప్రస్తావించే ఇందులో ప్రతీ క్యారెక్టర్ ప్రత్యేకమే. ఇక ఇందులో చెప్పుకోతగ్గ పాత్ర పేరు అప్పు. ప్రస్తత స్టార్ హీరోగా మారిన నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా అప్పు నటించి ఆకట్టుకుంది.

బేబీ కటింగ్ లో కళ్లద్దాలు పెట్టుకొని కనిపించే అప్పూ అసలు పేరు గాయత్రీ రావు. గాయత్రీ రావు తల్లిదండ్రులూ నటీనటులే. ఈమె తల్లి బెంగుళూరు పద్మగా పేరు సంపాదించింది. అయితే గాయత్రీ రావు ‘హ్యాపీ డేస్ ’ తరువాత గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. అయితే ఇండస్ట్రీలో పోటీ కారణంగా ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో అరెంజ్ మ్యారేజ్ చేసుసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తరువాత గాయత్రీ రావు మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు.

ఇటీవల ఆమె లెటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘హ్యాపీడేస్’ లో చూసిన అప్పుకు ఇప్పటి గాయత్రీ రావు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆ సినిమాలో సన్నగా.. చిన్నగా కనిపించిన గాయత్రీ రావు ఇప్పుడు లావయ్యారు. అయితే తనకు సినిమాల్లో నటించాలన కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకున్నానని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికైనా సినిమాల్లో నటించే చాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తానని చెబుతోంది.

అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లయిన తరువాత సైడ్ క్యారెక్టర్ గా రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు సైతం పెళ్లయిన వారికి ప్రత్యేక పాత్రలు సృష్టించి అవకాశం ఇస్తున్నారు. ‘హ్యాపీడేస్’ సినిమాలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న గాయత్రీ రావును మరోసారి సినిమాల్లో చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఆమెకు ఏ డైరెక్టర్ అవకాశం ఇస్తారో చూడాలి.

Leave a Comment