‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

మలయాళ భామలు తెలుగులో చాలా మంది హీరోయిన్లుగా రాణించారు. వారిలో ఆసిన్ కూడా ఒకరు. ఎటువంటి సినీ బ్యాక్రౌండ్ లేకున్నా ఆసిన్ సినిమాల్లో రాణించారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగులో ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా తెలుగులోనే సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆసిన్ వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి సినిమాల్లో నటించింది. అయతే ఆసిన్ కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె పెళ్లయిన తరువాత సినిమాల్లో నటించలేదు. అయితే ఆసిన్ కు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యాయి.

కేరళకు చెందిన ఆసిన్ మోడల్ గా రాణించారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. అమ్మనాన్న తమిళ అమ్మాయితో పాటు శివమణి, లక్ష్మీనరసింహా, ఘర్షణ, అన్నవరం లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లోనూ ఆసిన్ అలరించారు. అయితే అన్నవరం సినిమా తరువాత ఆసిన్ మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆసిన్ కూడా ఆపర్లు తగ్గాయి. కానీ తమిళ, మలయాళంలో సినిమాలు చేశారు.

ఈ తరుణంలో 2016లో రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు. ఈయన మైక్రోమ్యాక్స్ సీఈవో అన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే ఆ తరువాత ఆసిన్ విదేశాల్లో ఉంటున్నారని కొందరు అన్నారు. దీంతో తన పర్సనల్ ఫొటోలను ఎవరితో షేర్ చేసుకోలేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్ కూడా ఆసిన్ మెయింటేన్ చేయలేదు. సినిమాల్లో నటించడం తప్ప ఆడంబరం చేయడం ఆసిన్ కు నచ్చదన్నట్లు తెలుస్తోంది.

అయితే తనతో కొందరు సెల్పీ దిగిన ఓ యువతి ఆసిన్ ఫొటోలను సోషల్ మీడియాకు షేర్ చేసింది. ఇందులో ఆసిన్ అప్పటిలాగే అందంగా ఉన్నారు. ఆసిన్ కు ప్రస్తుతం ఓ పాప అని సమాచారం. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార వేత్తగా ఆసిన్ రాణించారు. ఓ కంపెనీకి యజమాని కూడా అయితే పెళ్లయిన తరువాత ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తుందో కూడా ఆసిన్ వివరాలు వెల్లడించలేదు.

Leave a Comment