‘ఇడియట్’ రక్షిత లెటేస్ట్ ఫొటోస్ చూశారా..? ఎలా మారిందంటే..?

లవ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సెంటిమెంట్ ఎమోషనల్ తెప్పించిన మూవీల్లో ‘ఇడియట్’ ఒకటి. హీరో రవితేజ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస హిట్లతో పూరి జగన్నాథ్ దూసుకుపోయాడు. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత లు నటించారు. రవితేజకు జోడీగా రక్షిత హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో పాటు అనుకువను ప్రదర్శించిన రక్షితకు ఈ సినిమా తరువాత ఫ్యాన్స్ విపరీతంగా మారిపోయారు. దీంతో రక్షితకు వరుసగా ఆఫర్లువచ్చాయి. దీంతో ‘ఆంధ్రావాలా’, ‘శివమణి’ లాంటి సినిమాల్లో నటించారు.

అయితే కొన్ని సినిమాల తరువాత రక్షిత సైడ్ క్యారెక్టర్ గా వచ్చారు. హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడంతో ‘అందరివాడు’ సినిమాలో డ్యాన్సర్ గా కూడా నటించారు. తెలుగులో అవకాశాలు లేకపోయినా కన్నడంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే రక్షిత ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇటీవల ఆమె లెటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియలోకి రావడంతో అందరూ షాక్ అయ్యారు. సన్నగా, అందంగా ఉన్న రక్షిత ఇప్పుడు బొద్దుగా మారిపోయారు.

సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండగానే రక్షిత 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను వివాహం చేసుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించలేదు. కొన్ని రోజుల తరువాత రక్షిత దంపతులకు కుమారుడు జన్మించాడు. అయితే ఆమె కుమారుడు జన్మించిన తరువాత థైరాయిడ్ సమస్యతో లావయినట్లు రక్షిత ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాను లావయినందుకు ఏమాత్రం బాధపడడం లేదని అన్నారు. అమ్మాయిలకు అందం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదని అన్నారు.

ఇటీవల రక్షిత డ్యాన్స్ షో ల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు సినిమాలు పూర్తి చేసి టీవీ షోల్లోకి వస్తున్నారు. రక్షిత కూడా డ్యాన్స్ షో కు జడ్జిగా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ రాజకీయ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రక్షిత లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment