‘ఒక్కడు’ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలని ఉందా..?

మహేశ్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఒక్కడు’ మూవీ సెన్సెషనల్ సాధించింది. మహేశ్ బాబు అప్పటి వరకు సోలో హీరోగా నటించి ఒక్కసారిగా మాస్ మూవీ చేసి అందరినీ మెప్పించాడు. లవ్ యాంగిల్ లో వచ్చిన ఇందులో మహేశ్ తో పాటు భూమిక నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, అచ్యుత్, ముఖేశ్ రుషి లాంటి వారు నటించారు. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర పేరు ఆశ. మహేశ్ చెల్లెలు పాత్రలో నటించిన ఈమె పేరు నిహారిక. నిహారిక చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించింది. ‘తార’ అనే సినిమా నిహారిక ప్రధాన పాత్రలోవచ్చింది. అయితే నిహారిక ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు.

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకనిపించిన వారు ఆ తరువాత సినిమాల్లో కనిపించాలని కొందరు అనుకుంటారు. మరికొందరు మాత్రం ఇతర రంగాల్లో సెటిలవుతారు. అయితే హీరోయిన్ గా రాణించాలంటే అనుభవం మాత్రమే కాదు అందంగా ఉండాలి. అంతేకకుండా నటనలో సుశిక్షుతులై ఉండాలి. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలుకలిగి ఉంటేనే ఈరోజుల్లో హీరోయిన్ గా రాణిస్తున్నారు.

వెంకటేశ్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘ప్రేమించుకుందాం రా..’ సినిమాలో నిహారిక మొదటిసారిగా కనిపిస్తుంది. ఆ తరువత యమజాతకుడు సినిమాలోనూ అలరించింది. అయితే ఆ సమయంలో నిహారికకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె తల్లిదండ్రులు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించడంతో చదువును కొనసాగించింది. దీంతో నిహారిక మళ్లీ సినిమల్లో కనిపించలేదు.

అయితే ఇటీవల నిహారికకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు సోషల్మీడియలో హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్లకు తీసిపోని విధంగా నిహారిక అందంగా తయారైంది. సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని నిహారిక ఎదురుచూస్తోంది. అయితే ఓ ప్రముఖ దర్శకుడు ఈమెకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తొందర్లోనే నిహారిక హీరోయిన్ గా తెరపై కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా రాణించారు. కొందు మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అయితే నిహారిక ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

Leave a Comment