నయన తార చెల్లెలు ఎన్నివేల కోట్లకు వారసురాలో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ సక్సెస్ తో దూసుకెళ్తోంది. చాలా రోజుల తరువాత మెగాస్టార్.. ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమాలో మరో స్టార్ సల్మాన్ ఖాన్ నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇందులో నయనతార కూడా నటించి అలరించింది. అయితే నయన తార చెల్లెలుగా ఓ అమ్మాయి నటించింది. ఆమె ఎవకో కొత్త నటి అని అందరూ అనుకున్నారు. ఆమె పేరు తాన్యా రవిచంద్రన్. సీనియర్ నటుడు రవిచంద్రన్ మనువరాలే ఈ అమ్మాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారసులు వెండితెరపై కనిపించడం పెద్ద విషయం కాదు. కానీ ఆమెకున్న ఆస్తుల వివరాలు చూసి అందరూ షాక్ తింటున్నారు. ఇంతకీ తాన్యా రవిచంద్రన్ కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలిస్తే షాక్ అవుతారు.

తాన్యా రవిచంద్రన్ చెన్నైలో పీజీ చేశారు. ఈ సమయంలోనే ఆమెకు 2016లో నటించే అవకాశం చ్చింది. ‘బల్లె వెళ్లైయితేవా’ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బృందావనం, కురుప్పన్ అనే సినిమాల్లో నటించింది. దీంతో ఫేమస్ అయిన తాన్యాకు తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో 2021లో ‘రాజ విక్రమార్క’ అనే సినిమాలో మొదటిసారిగా కనిపించారు. దీంతో ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి. రీసెంట్ గా గాడ్ ఫాదర్ లో నటించి మెప్పించారు.

చదువులో ఎప్పుడూ ముందుండే తాన్యా ఎంఏ హ్యుమన్ రిసోర్స్ మెనేజ్మెంట్ చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఇప్పటికే కోట్ల రూపాయలకు వారసురాలు. ఆమె ఆస్తి గురించి చెప్పుకున్నప్పుడు.. ఏకకాలంలో రూ. 10,000 కోట్ల డీలింగ్ పెట్టే సామర్థ్యం ఆమెకుందట. అంతపెద్ద మొత్తంలో ఆస్తులున్నా తాన్యా మాత్రం సాదాసీదాగా కనిపిస్తుంది. హీరోయిన్ రేంజ్ లో ఉన్న తాన్యాకు మరిన్ని అవకాశాలు వస్తాయని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు.

సినిమాల్లోనే కాకుండా తాన్యా ‘పేపర్ రాకెట్’ అనే వెబ్ సిరీసుల్లో నటించి ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తే మొదటి ప్రిఫరెన్స్ సినిమాకే ఇస్తానని తాన్యా పలు సందర్బాల్లో చెప్పారు. ఇక నయనతార చెల్లెలిగా గాడ్ ఫాదర్ సినిమాలో తాన్యా నటనకు అందరూ ఫిదా అయ్యారు. రెండో సినిమాతోనే స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందంటే ఆమె ముందు ముందు మరిన్ని సక్సెస్ సినిమాల్లో నటిస్తుందని అంటున్నారు.

Leave a Comment