గాడ్ ఫాదర్ సినిమా కోసం గెటప్ శ్రీను ఎంత తీసుకున్నాడో తెలుసా..?

చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. చాలా రోజుల తరువాత మెగాస్టార్ నటించిన సినిమా సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో భారీ తారాగణంతో వచ్చిన ఇందులో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించారు. అలాగే సత్యదేవ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఇక ఇందులో కమెడిన్ గెటప్ శ్రీను కూడా కీలక పాత్రలో పోషించి ఆకట్టుకున్నారు. జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా ఫేమస్ అయిన గెటప్ శ్రీను మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నాడు. అయితే ఈ సినిమాలో నటించినందుకు గెటప్ శ్రీను తీసుకున్న రెమ్యూనరేషన్ చూసి షాక్ అవుతున్నారు.

జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా ఫేమస్ అయిన గెటప్ శ్రీను ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. జబర్దస్త్ ప్రొగ్రాంలో బుల్లితెర కమలాసన్ లా పేరు తెచ్చుకున్న ఆయన నటనకు చాలా మంది ఆకర్షితులయ్యేవారు ఉన్నారు.ఈ క్రమంలో వెండితెరపై కనిపించినప్పటి నుంచి ఆయన సినిమాలను ఫాలో అవుతున్నారు. వెండితెర ఎంట్రీ ఎప్పుడో ఇచ్చినా ఇన్నాళ్లకు ఆయనకు మెగాస్టార్ తో నటించే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా తన ఫర్ఫామెన్స్ ను చూపించాడు.

ఇక గెటస్ శ్రీను గాడ్ ఫాదర్ లో నటించిందుకు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు రూ.10 లక్షలు అందుకున్నాడట. అంతేకాకుండా గెటప్ శ్రీనుకు ప్రత్యేకంగా చిరంజీవినే అవకాశం ఇచ్చాడని అంటున్నారు. గతంలోనూ కొన్ని సినిమాల్లో నటించేందుకు చిరు అవకాశాలు ఇప్పించాడని అంటున్నారు. చాలా మంది కమెడియన్ల పాలిట చిరు దేవుడని కొందరు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో గెటప్ శీను ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. బట్టలు చింపుకోవడానికి రెడీగా ఉండండి.. అని అప్పుడే అన్నాడు. ఆయన అన్నట్లుగానే సినిమా సక్సెస్ కావడంతో చిరు అభినందించాడట. అంతేకాకుండా నాలాంటి వారికి ఎంతో మందికి అవకాశం ఇచ్చిన చిరుకు ప్రత్యేక ధన్యవాదాలు అని గెటప్ శీను అనడం విశేషం.

Leave a Comment