అందరినీ నవ్వించే ఈ నటి ఎందుకు ఆత్మహత్యకు యత్నించింది..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హస్య నటులకు మంచి గుర్తింపు ఉంటుంది. ఎక్కువగా కామెడీ సినిమాలు కోరుకునే తెలుగువాళ్లు ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నింటినీ ఆదరించారు. ఈ క్రమంలో ఆనాటి ‘జంబలకిడి పంబ’ నుంచి నేటి ‘సీమ టపాకాయ్’ వరకు కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇలాంటి సినిమాల్లో నటించిన వారికి సైతం ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు గీతా సింగ్. ఈమె ఈమధ్య సినిమాల్లో కనిపించడం లేదు. అవకాశాలు రాకనో.. మరే కారణమో తెలియు గానీ.. వెండితెరపై ఆమె కనిపించకపోయే సరికి అందరూ ఆమె గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషాద వార్తను వినాల్సి వచ్చింది. ఇంతకీ గీతా సింగ్ కు ఏమైంది..? ఆమె ఆత్మహత్యకు యత్నించడానికి కారణమేంటి..?

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన గీతా సింగ్ 2004లో తేజ సినిమా ‘జై’తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో గీతా సింగ్ హీరోయిన్ స్నేహితురాలిగా కనిపిస్తుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినా గుర్తింపు రాలేదు. కానీ ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ‘కితకితలు’ సినిమాలో మెయిన్ రోల్ లో నటించారు. దీంతో గీతా సింగ్ స్టార్ నటిగా మారింది. ఆ తరువాత సీమ టపాకాయ్, తదితర కామెడీ సినిమాల్లో వరుసగా తీరిక లేకుండా నటించింది. దీంతో గీతా సింగ్ ఇక తనకు తిరుగులేదని భావించారు.

కొన్ని నెలలు ఇలా సాఫీగా గడిచిన తరువాత గీతా సింగ్ కు డబ్బు బాగా చేతికి వచ్చింది. అయితే ఆ డబ్బునంతా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ చిట్టి వ్యాపారికి ఇచ్చిందట. కొన్ని రోజుల తరువాత ఆ వ్యాపారి తనను మోసం చేసిందట. ఇలా దాదాపు రూ.10 లక్షల వరకు మోసపోయానని గీతా సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది.

ఈ క్రమంలో తాను గుళ్లో ప్రసాదంతో కడుపు నింపుకున్నట్లు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే గీతాసింగ్ ఇక తాను జీవితంలో ఎవరినీ నమ్మే ప్రసక్తే లేదని.. అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పింది. సినిమాల్లోనే కాకుండా గీతా సింగ్ టీవీ సీరియళ్లలోనూ సండి చేశారు.జెమిని టీవీలో ప్రసారమైన ‘ఆంధ్రా అందగాళ్లు’ అనే సీరియల్ లో నటించి తన ఫర్ఫామెన్స్ చూపించారు. గీతా సింగ్ కు ఇష్టమైన హీరో ఎవరంటే అల్లరి నరేశ్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో ఉంటున్నారు.

Leave a Comment