మహేశ్ బాబును వైజాగ్ లో కలిసిన హర్షసాయి..: ఎందుకంటే..?

టాటెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ వేదికగా మారింది. ఈ క్రమంలో కొందరు యూట్యూబ్ లో వీడియోలు పెట్టి లక్షాదికారులు అయ్యారు. దీని ద్వారా వచ్చే డబ్బును కొందరు తమ సొంతానికి వాడుకుంటుండగా..మరికొందరు మాత్రం పేదలకు దానం చేస్తూ దేవుడిలా నిలుస్తున్నారు. ఇలా ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి హర్ష సాయి. ఇటీవల హర్షసాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ చూసేవారికి ఈయనను పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పేదల జీవితాలను తన చానెళ్లలో చూపించి వారికి అవసరమైనంత సాయం చేసే ఈయనకు చాలా మంది సపోర్టు ఇస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వైజాగ్ కు వచ్చినప్పుడు ఆయనను హర్షసాయి కలిశాడట. ఆయనను కలవడానికి ఓ కారణం ఉందట..

హర్షసాయి 1999 మార్చి 8న విశాఖలో జన్మించాడు. గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన 2019 నుంచి యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం ప్రారంభించాడు. 23 ఏళ్ల హర్షసాయి యూట్యూబ్ లో అందరిలాగా ఎంటర్టైన్మెంట్ వీడియోలను అప్లోడ్ చేయలేదు. సమాజంలో పేదలు ఎలా ఉన్నారని చెబుతూ వారి గురించి చెప్పాడు. పేదవాళ్ల కలలు ఎలా ఉంటాయి..? వారి కోరికలేంటి..? అని తన చానెల్ ద్వారా తెలిపేవాడు. తనకు వచ్చిన సంపాదనలో కొంత వరకు వారి కలలను నిజం చేసేవాడు. ఆయన చేసే సాయం లక్షరూపాయల లోపే.. అయినా వారి అవసరాన్ని తీర్చేవిధంగా ఉంది.

https://youtu.be/TYfGbme8LGQ

ఇలా ఫేమస్ అయిన హర్షసాయికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. కొందరు తన ద్వారా పేదలకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తెలుగులోనేకాకుండా తమిళం, కన్నడం, హిందీ, మలయాళంలోనూ తన చానెళ్లను కొనసాగిస్తున్నాడు. అతి చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్న హర్ష సాయికి రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో షూటింగ్ పనిమీద వైజాక్ వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ ని హర్స సాయి కలిశాడు.

వీరి కలయికతో సినీ ఇండస్ట్రీలో సీరియస్ చర్చ సాగుతోంది. అయితే హర్ష సాయి చేస్తున్నసేవలను మహేశ్ మెచ్చుకున్నాడట. ఈ సందర్భంగా ‘మీరు చేసిన సేవల స్ఫూర్తితోనే.. తాను ఈ పని చేస్తున్నా’నని హర్ష సాయి చెప్పాడట. అయితే హర్షసాయితో నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చాడట. ఇక సోషల్ మీడియాలోనూ మహేశ్ ఫ్యాన్స్ హర్షసాయికి మా సపోర్టు ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.

Leave a Comment