టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కసారి వారి నటన నచ్చితే మరోసారి వారిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటారు. అలా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన అజయ్ రాజమౌళి ‘సై’ సినిమాలో విలన్ గ్రూపులో ఒకడిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరోసారి రాజమౌళి ‘విక్రమార్కుడు’ సినిమాలో మెయిన్ విలన్ గా అవకాశం ఇవ్వడంతో స్టార్ అయ్యాడు. అయితే రాను రాను అజయ్ కి సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అజయ్ తన గురించి చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్ చేశాడు.

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పెద్ద కృషే ఉండాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరో వరకు ఎదిగాడు అజయ్. ‘సారాయి వీర్రాజు’ అనే సీనిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగాడు.

ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో నటిస్తున్న అజయ్ తనకు సినిమా అవకాశాలు రావడం లేదని తెలిపాడు. అయితే తనకు ఒకవేళ వచ్చినా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానని చెబుతున్నాడు. అలా ఇప్పటికీ చాలా సినిమాలు క్యారెక్టర్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశానని అన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి కష్టాలు పడడం తెలుసునని అన్నాడు. 19 ఏళ్ల వయసులో నెపాల్ కు వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ లో డబ్బుల కోసం గిన్నెలు కడిగేవాడినని అన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న కష్టాలు పెద్దవేమి కాదని అన్నాడు.

9 అవర్స్ అనే వెబ్ సిరీసుల్లో కనిపించిన అజయ్ సినిమాల్లో మంచి పాత్ర దొరికితేనేనటిస్తానని అంటున్నాడు. అయితే చాలా మంది అజయ్ ఎందుకు సినిమాలు చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ద్వారా అసలు విషయం చెప్పాడు. మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తున్న అజయ్ కు తొందరగా అవకాశం రావాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here