Pawan Kalyan: ‘పవన్ ఒక టార్చ్ బేరర్’.. ఆయనో గొప్ప వ్యక్తి: తమిళనాడు సీఎం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు సినీ హీరో.. కానీ ఇప్పుడు రియల్ హీరో.. ఈ మాట సాధారణ వ్యక్తులు కాదు. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలినే అన్నాడు. పేదలను ఆదుకునే వ్యక్తి పవన్ మాత్రమేనన ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఆయన సేవ పొందిన వారిలో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడుకు చెందిన వాళ్లు కూడా ఉన్నారన్నారు. తమిళనాడులో అధికారంలో సీఎం స్టాలిన్ ఇలాంటి కామెంట్ చేయడం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా సీఎం స్టాలిన్ పవన్ గురించి ఏం మట్లాడారు..?

సాధారణంగా రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే చూస్తుంటాం. ప్రశంసలు చేసుకోవడం చాలా అరుదు. పార్టీల పొత్తుల క్రమంలో ఇలాంటివి కనిపిస్తాయి. కానీ ఏమాత్రం సంబంధం లేని.. అదీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న స్టాలిన్ పవన్ గుర్తించడం ప్రత్యేక విషయంగానే పరిగణించాలి. ఇన్నాళ్లు పవన్ ప్రజల్లో తిరుగుతుంటే కొందరు టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని అనుకున్నారు. కానీ చేసిన సాయానికి ఎన్నిటికైనా గుర్తింపు వస్తుంది. కానీ ఏకంగా ఈ గుర్తింపు పక్క రాష్ట్రానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల పవన్ కౌలు రైతుల కోసం ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.5 కోట్లను వెచ్చించి కొందరు రైతులకు రూ. లక్ష చొప్పున అందించారు. అధికారంలో లేకున్నా పవన్ తన సొంత డబ్బుతో రైతులకు సాయం చేయడంపై స్టాలిన్ స్పందించారు. ఇలా సొంత డబ్బుతో సాయం చేసేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్లలో పవన్ ఒకరు అనడం ఆసక్తిగా మారింది. ఆపద వచ్చిన ప్రతీ వ్యక్తికి కాదన లేకుండా సాయం చేసే పవన్ ను ప్రజల్లో ఎప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు.

కేవలం రైతులకే కాకుండా మిగతా వారిని కూడా పవన్ ఆపదలో ఆదుకున్నాడు. కానీ ఏనాడు ఆయన వ్యక్తిగతంగా ఈ విషయాన్ని చెప్పుకోలేదు. ఈ విషయం ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తమిళనాడు సీఎం ఆ విషయం ప్రస్తావించడం విశేషం. పవన్ సినిమాల ద్వారా బాగా డబ్బు సంపాదిస్తున్నారని కొందరు అంటుంటారు. కానీ ఆయన వచ్చిన వాటిలో సగం వరకు పేదల కోసం ఖర్చుపెడుతారన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు తమిళనాడు సీఎం కు తెలిసింది. పవన్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తే ముందు ముందు మరింత గొప్పగా ఎదుగుతారని ఆశిస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. సినిమాల్లో స్టార్ గా కనిపిస్తున్నా పవన్ ఆర్థికంగా లోటుగానే ఉన్నారు. తనకు సినిమాల్లో వచ్చిన డబ్బునంతా పేదవారికి సాయం చేయడానికే వెచ్చిస్తారని అంటున్నారు. తాను అధికారంలో ఉన్నా.. లేకున్నా.. పేదల పక్షాన ఉంటాడని చర్చించుకుంటున్నాడు. అందుకే ఆయన చేసిన సాయం తెలుగు రాష్ట్రాలను దాటి తమిళనాడు సీఎం వరకు వెళ్లిందని అనుకుంటున్నారు.

Leave a Comment