Baby Shamili: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బేబి షామిలి..: ఇప్పుడు చూస్తే షాకే..

Baby Shamili: చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. కొందరు స్టార్లుగా మారినా.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చిన్నప్పుడు తన నటనతో ఆకట్టుకున్న బేబీ షామిలిని ఇప్పటీకీ ఎవరూ మరిచిపోరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగులో చాలా సినిమాలలో నటించింది. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా రాణించలేకపోయింది. మొదటి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన షామిలి చాలా రోజులు సినిమాల్లో కనిపించింది. కానీ ఇటీవల తన అక్క షాలిని ఫంక్షన్లో ఈ భామ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇచ్చింది.

జగదేకవీరుడు-అతిలోక సుందరి, అంజలి లాంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బేబీ షామిలి. అయితే ఆ తరువాత సినిమాల్లోకి రాకుండా చదువుపై దృష్టి పెట్టింది. మిగతా చైల్డ్ ఆర్టిస్టుల్లాగే బేబీ షామిలి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్థ హీరోగా వచ్చిన ‘ఓయ్’లో కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ సాధించినా స్టోరీ బాగా లేకపోవడంతో ఆకట్టుకోలేదు. దీంతో కొంతకాలం అవకాశాల కోసం వెయిట్ చేసింది.

కానీ ఆ తరువాత బ్యూటీనెస్ పై ఇంట్రెస్ట్ పెట్టి సన్నగా మారింది. ఈ క్రమంలో అమెకు తెలుగులో నాగశౌర్య పక్కన నటించే అవకాశం వచ్చింది. ‘అమ్మమ్మగారి ఇల్లు’ సినిమాలో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. బొద్దుగా ఉండే షామిలి ఇలా మారేందేమిటి..? అని చర్చించుకున్నారు. అయితే ఈ భామకు అదృష్టం ఇంకా తలుపు తట్టనట్లయింది. ఆ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో షాలిని ఏ సినిమాల్లోనూ చాన్స్ రాలేదు. దీంతో ఉన్నత చదువులు కొనసాగిస్తోంది.

అయితే ఇటీవల షామిలి ఓ ఫంక్షన్లో మెరిసింది. తన అక్క షాలిని, ఆమె కూతురుతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలో ఆమె షామిలినేనా..? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరూ గుర్తుపట్టేలనంతగా అందగా మారిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే షామిలికి ఇప్పటికైనా అవకాశాలు వస్తాయా..? అని అనుకుంటున్నారు. కానీ ఏ చాన్స్ వచ్చినా మిస్ చేసుకోవద్దనే ఆలోచనలో షామిలి ఉందట.

Leave a Comment