Prisons-Conjugal Meeting Room: జైళ్లో భార్యాభర్తలు శారీరకంగా కలిసేందుకు బెడ్ రూమ్..

Prisons-Conjugal Meeting Room: అవును మీరు చదివింది నిజమే. ఇదేదో జరిగిన కథనో.. లేదా వేరే దేశంలో కాదు. మనదేశంలోనే ఇలాంటి సౌకర్యం ఉంది. నేరం చేసిన ఖైదీలు కోరుకుంటే తమ భార్యతో ఏకాంతంగా 2 గంటలు జీవించొచ్చు. అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇవి చేయడానికి జైలు అధికారులు ప్రత్యేకంగా ఓ బెడ్ రూం కూడా ఇస్తారు. అయితే ఇలాంటి సౌకర్యం రావాలంటే కొన్ని షరతులు విధిస్తారు. ఆ షరతులకు ఒప్పుకుంటేనే ఇలా తన భార్యతో గడిపేందుకు అనుమతిస్తారు. ఇంతకీ ఈ అరుదైన సౌకర్యం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా..? అయితే కిందికి వెళ్లండి..

సాధారణంగా నేరం చేసిన ఖైదీలకు వారి తప్పులను భట్టి శిక్షలు వేస్తారు. కొందరికీ కఠినకారాగారం ఉంటే.. మరికొందరికి సాధారణ శిక్షలు వేస్తారు. ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నా.. వారి మనసును కాస్త ఉల్లాసంగా మార్చడానికి అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కొందరికి ఫోన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. నేరుగా కూడామాట్లాడే అవకాశం కల్పిస్తారు. కుటుంబ సభ్యులు ఇలా నేరుగా కలిసినా వారి మధ్య అడ్డుగోడలా జాలీలు ఉంటాయి. నేరుగా వారిని టచ్ చేసే అవకాశం ఉండదు. కానీ పంజాబ్ ప్రభుత్వం మాత్రం కొత్త పథకం తీసుకొచ్చింది. అదే.. ఖైదీలు తమ భార్యలతో ఏకాంతంగా గడుపొచ్చు అని..

పంజాబ్ రాష్ట్రంలోని గోయింద్ వాల్ జైలులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఖైదీలు తమ భార్యలతో ఏకాంతంగా గడపాలని కోరుకుంటే అధికారులు సౌకర్యాన్ని కల్పిస్తారు. అయితే మూడు నెలల ముందే ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలి. దానిని అమోదించడం లేదా రద్దు చేయడం అంతా జైలర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆమోదిస్తే మాత్రం ఖైదీ తన భార్యతో ఏకంతంగానే కాకుండా లైంగికంగా కూడా కలవొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా గదిని కూడా ఇస్తారు. మిగిలిన జైలు మాదిరిగానే ఈ జైలులో ప్రవేశించడానికి రెండు సెక్యూరిటీ తనిఖీలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరువాత మొదటి అంతస్తులో ఒక గదిని బెడ్ రూం కోసం కేటాయించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇందులో ఒక టేబుల్, రెండు కుర్చీలు, ఒక చిన్న స్టూల్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

పంజాబ్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఖైదీ తన భార్యను కలిసినప్పుడు ఏకాంతంగా కలవొచ్చు. కుటుంబ బంధాలను బలపరుచుకునేందుకు, ఖైదీలు ఉత్తమంగా ప్రవర్తించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని అధికారులు చెబుతున్నారు. భార్యభార్తలు జైలులో ఏకాంతంగా కలుసుకునే అనుమతి అమెరికా, ఫిలిప్సీన్, కెనడా, సౌదీ అరేబియా,జర్మనీ దేశాల్లో అమలు ఉంది. కానీ భారతదేశంలో పంజాబ్ మొదటిసారిగా ప్రవేశపెట్టింది.

ఈ పథకాన్ని 60 ఏళ్ల గురుజిత్ సింగ్ మొదటిసారిగా వినియోగించుకున్నారు. ఆయన హత్యానేరంపై జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొన్ని నెలలపాటు జైలులో ఉన్న ఆయనకు తన భార్యతో ఏకాంతంగా గడపాలని అభ్యర్థన పెట్టుకున్నారు. దీంతో అధికారులు ఆమోదించడంతో రెండు గంటలపాటు ఏకాంతంగా గడిపినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 20న మూడు జైళ్లో అమలు చేశారు. అక్టోబర్ 3 నాటికి 17 జైళ్లకు విస్తరించారు. ఈ పథకం ప్రవేశపెట్టగానే ఇప్పటి వరకు 385 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.

Leave a Comment