నాగార్జునకు హీరోయిన్ కష్టాలు…

హీరో నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు.. ఇంతకు ముందు నాగ్ కనిపించని థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాగ్ కు సెట్ అయ్యే ఒక అమ్మాయి హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారని తెలుస్తుంది.హీరోయిన్‌ పాత్ర ఒక గూఢచారి. ఇందుకోసం మొదట చందమామ కాజల్‌ అగర్వాల్‌ను మేకర్స్ సెలెక్ట్‌ చేశారని సమాచారం. కాజల్‌తో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ అమ్మడు మధ్యలోనే హ్యాంద్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ వేట లో చిత్రబృందం ఉన్నారు. షూటింగ్ పూర్తి అయిన బంగార్రాజు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..

Leave a Comment