మటన్ కొంటే గిఫ్ట్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

మటన్ కొంటే గిఫ్ట్ ఫ్రీ.. అవునా ఇది నిజమా.. నమ్మలెకున్నాము. ఎక్కడా ఇస్తారు, ఎం గిఫ్ట్ ఇస్తారు అనే సందేహం అందరినీ కలచివేస్తుంది. ఈ ప్రకటన హైదరాబాద్ లో వెలుగులొకి వచ్చింది.పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి.మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్‌లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి ఈ టిఫిన్ బాక్స్ ఆఫర్ పెట్టాడు. జనవరి1, 2 తేదీల్లో తన షాపునకు వచ్చే వినియోగదారుల కోసం మటన్ ప్రియులకు బంపర్ ఆఫరిచ్చాడు. కిలో మటన్‌కు ఓ టిఫిన్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నాడు. ఈ ఆఫర్ రెండు రోజుల పాటు ఉండడంతో మటన్ ప్రియులు క్యూ కట్టారు. ఎంత ఆలస్యం అయినా మటన్, టిఫిన్ బాక్స్ తీసుకొని వెళుతూ కనిపించారు..ఈ ఆఫర్ మరి కొన్ని రోజులు వుంటే మాత్రం అతను చాలా ఫెమస్ అవ్వడం ఖాయం.

Leave a Comment