బ్రేకింగ్.. హీరో నాని కాలికి గాయాలు..

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమా తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ లో నానీ బిజిగా ఉన్నాడు. ఈ క్రమంలో కొన్ని కీలక సన్నీవేశాలు చేస్తున్నా సమయంలొ అతని కాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది.దీంతో ఆయనను ఒక ప్రముఖ ఆస్పత్రికి తరలించారని సమాచారం. అయితే ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..హీరో నాని కాలు కు తీవ్ర గాయం అయిందన్న వార్త తెలిసిన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కాగా హీరో నాని ప్రస్తుతం అంటే సుందరానికి అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఇటీవల ఆ సినిమా కు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో నాని కొత్తగా కనిపిస్తాడు.అది నాని ఫ్యాన్స్ తో పాటుగా జనాలకు కూడా విపరీతంగా నచ్చింది. త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తీ చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉంది.అయితే ఇలాంటి పరిస్థతుల్లో నాని కాలుకు తీవ్ర గాయం అయిందన్న వార్త తెలిసిన అభిమనులు ఆందోళన చెందుతున్నారు. అయితే హీరో నాని కాలు గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment