తండ్రి పేరు నిలబెట్టిన మాధవన్ కొడుకు..: ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలుసా..?

ఒక తండ్రికి కొడుకు పుట్టగానే సంతోషపడుతాడు.. కానీ ఆ కొడుకు ఎదిగినప్పుడే అ తండ్రికి నిజమైన ఆనందపడుతాడు. అలాంటి ఆనందాన్ని ఇప్పుడో స్టార్ హీరో పొందాడు. తన జీవితంలో ఎన్నో సక్సెస్ లు చూసిన ఆ హీరో ఇప్పుడు తన కుమారుడి ద్వారా కళ్లారా చూసుకుంటున్నాడు. సినిమాల్లోకి వచ్చే చాలా మంది స్టార్ హీరోలు తమ కుమారులు కూడా స్టార్ హీరో కావాలని కోరుకుంటారు. కానీ ఈయన మాత్రం తన పుత్రుడిని క్రీడల వైపు పంపించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

1990 దశకంలో కొనసాగిన స్టార్ హీరోల్లో మాధవన్ ఒకరు. సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఆయన అంతకుముందే సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం హిందీ.. ఇలా ఏడు భాషల్లో నటించిన గుర్తింపు మాధవన్ కు ఉంది. ఇటీవల ఆయన డైరెక్షన్ కం హీరోగా వచ్చిన ‘రాకెట్రీ’ మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ తరుణంలో మాధవన్ ఇంట మరో సంతోషం వెల్లివెరిసింది. ఈసారి ఆయన పుత్రుడు సాధించిన విజయాలతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. ఇంతకీ మాధవన్ కొడుకు ఎవరు..? ఆయన సాధించిన విజయాలేంటి..?

మొదట్లో సీరియళ్లలో నటించిన మాధవన్ ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘అలై పాయుదే’ సినిమాతో స్టార్ డం వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించిన మాధవన్ కు చాక్లెట్ బాయ్ గా పేరుంది. ఆయన ఏడు భాషల్లో నటించినా చేసింది తక్కువ సినిమాలే. కానీ పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లో ఫేమస్ కాకముందే మాధవన్ సరితా బిర్జే అనే అమ్మాయిని 1999లో పెళ్లి చేసుకున్నారు. మాధవన్ ను ఇంటర్వ్యూకు చేయడానికి వచ్చిన ఆమెను పెళ్లి చేసుకున్నాడని అంటారు.

ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. వేదాంత్ చదువుకుంటూనే క్రీడల్లో రాణిస్తున్నాడు. అతను మంచి స్విమ్మర్. చిన్నప్పుడే క్రీడల్లో మంచి పట్టు సాధించాడు. వేదాంత్ 12 సంవత్సరాల వయసులో ఉండగానే 2018లో థాయిలాండ్ లో మొదటి స్విమ్మింగ్ అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత బెంగుళూర్ లో జరిగిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్ 2021లో ఏడు పతకాలు సాధించాడు. 800 మీటర్ల ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్ , 600, 800ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్ రిలేలో రజత పతకాలు సాధించాడు. మహారాష్ట్రలో జరిగిన పోటీల్లో 100 ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్, 200 మీటర్ల ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్, 400 ఫ్రీస్ట్రైల్ స్విమ్మింగ్ లో కాంస్య పతకాలకు గెలుచుకున్నాడు.

నిత్యం సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉండే మాధవన్ ఎప్పటికప్పుడు తన గారాల కొడుకు గురించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు. గతంలో ఓ పిక్ ను షేర్ చేసి భారత్ తరుపున ఆడిన తన కుమారుడు స్వర్ణం, 2 కాంస్యాలు సాధించినందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. ఒక తండ్రికి కుమారుడు పుట్టినప్పుడే కాకుండా ఆ కొడుకు ఎదిగినప్పుడే అధిక సంతోషాన్ని ఇస్తుందంటారు. ఇప్పుడు మాధవన్ కు అలాంటి సంతోషం పట్టలేనంతగా వచ్చిందనుకోవచ్చు.

Leave a Comment