వెండితెర ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు జీవితం ఒకలాగా.. ఆ తరువాత మరోలా ఉంటుది. చాలా మంది సినిమాల్లోకి వచ్చే ముందు ఏవేవో ఊహించుకుంటారు. కానీ ఆ తరువాత ఊహించని సంఘటనల ఎదుర్కొని మథనపడుతారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తొందరపడుతారు.. ఆ తరువాత వెంటనే విడాకులు తీసుకుంటారు.కొంతమంది హీరోయిన్లు.. హీరోలను, ఇతర టెక్నీషియన్లను పెళ్లి చేసుకున్నవారు ఎక్కువకాలం కలిసుండలేకపోయారు. పెళ్లిచేసుకున్నంతసేపట్లోనే విడాకులు తీసుకున్నారు. మరికొందరు గాఢంగా ప్రేమించుకున్నవారు తమ ప్రేమికుల మరణాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో వారి మరణానికి కారణం ప్రేయసిలే అనే అపవాదును ఎదుర్కొన్నారు. అలా ఇండస్ట్రీలో కష్టాల పడ్డ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం..

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం ఇండియా లెవల్లోనే సంచలనం సృష్టించింది. లాక్డౌన్ సమయంలో ఆయన ఇంట్లో ఉరేసుకొని మరణించాడు. సుశాంత్ మరణానికి కారణాలవో తెలియదు కానీ.. నెపోటిజం కారణమంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కొంతమంది తన ప్రేయసి రియా చక్రవర్తి కారణమని ఆరోపించారు. అటు సుశాంత్ కుటుంబం సైతం రియాపై కేసులు పెట్టడంతో పోలీసులు ఆమెను కొన్ని రోజుల పాటు విచారించారు.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖా సైతం ఓ వివాదంలో చిక్కుకుంది. అంతకుముందు అమితాబ్ బచ్చన్ ను పీకల్లోతుగా ప్రేమించింది. ఆ తరువాత అమితాబ్ జయాబచ్చన్ ను పెళ్లి చేసుకోవడంతో కొన్ని రోజుల పాటు ఖాళీగానే ఉంది. కొన్ని రోజుల తరువాత ముఖేశ్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఏమైందో తెలియదు గానీ.. ముఖేశ్ ఏడాది తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణానికి కారణం రేఖ కారణమంటూ మీడియా సైతం దుమ్మెత్తి పోసింది.

ఇలాంటి సంఘటనలు సినిమాల్లోని వారికే కాకుండా టీవీల్లో నటించేవారికి ఎదురయ్యాయి. బుల్లితెర హీరోయిన్ పావని తన తోటి నటుడైన ప్రదీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు సాఫీగానే ఉన్నా కొన్ని గొడవల కారణంగా ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణానికి పావని కారణమంటూ కామెంట్స్ చేశారు. దీంతో పావని తెలుగు సీరియల్స్ లో నటించడం మానేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here