వావ్.. పవన్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్..

వకీల్ సాబ్ సక్సెస్ తర్వాత పవన్ సినిమాల జొరును పెంచారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా లో నటిస్తున్నాడు. పవన్ , రానాలు ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా ఇంకా పూర్తీ కాకమునుపె మరో సినిమాను లైన్ లో పెట్టాడు. హరి హర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిపోయారు. పవన్‌ కల్యాణ్‌ – క్రిష్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఏ.ఎం.రత్నం నిర్మాత. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.

త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ”స్ర్కిప్టు రీడింగ్‌ సెషన్స్‌ జరుగుతున్నాయి. కొత్త యేడాది షూటింగ్‌ ప్రారంభిస్తాం” అని ట్వీట్‌ చేశారు క్రిష్‌. 2022 జనవరి నుంచి ‘వీరమల్లు’ సెట్స్‌పైకి వెళ్లబోతోందన్నమాట. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు రాశారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో రీమెక్ సినిమా ను లైన్ లో పెడుతున్నారు. ఆ సినిమా ను ఎప్పుడూ సెట్స్ మీదకు తీసుకెల్థారు, ఎవరూ డైరెక్టర్ అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

Leave a Comment