100 మంది వైద్యులు శ్రమించి వారి తలలను వేరు చేశారు..

అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ గొప్పదంటారు. మిగతా వాటికంటే మానవులకు అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే కొందరికి మనుషులుగా కూడా సరైన జన్మ ఉండదు. ఎన్నో రకాల రుగ్మతలతో బాధపడుతూ పుడుతారు. ఇంకొందరు పుట్టుకతో అనుబంధాలు, ఆప్యాయతలను పోగొట్టుకుంటారు. ఇక కొందరు కవలలుగా పుడుతారు. కవలలుగా పుట్టడం ఎంతో అదృష్టమంటారు. అయితే ఇలా కవలలు తలలు అతుక్కొని పుట్టడం ఎంత నరకమో మనకు తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వీణా, వాణిలో తలలు అతుక్కొని జన్మించారు. అయితే వారికి ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ ఇలా తలలు అతుక్కొని జన్మించిన వారికి కొందరు వైద్యులు శస్త్ర చికిత్స చేసి వారిని విడదీశారు.

ప్రపంచంలో దాదాపు 60 వేల మంది ఇలా తలలు అంటిపెట్టుకొని పుడుతూ ఉంటారట. ఇలా పుట్టిన వారిలో ఏడుగురికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేశారు. తాజాగా లండన్ లో ఇద్దరు అబ్బాయిలు ఇలాగే తలలు అంటిపెట్టుకొని జన్మించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే లండన్లోని ఓ వైద్య శాలకు చెందిన డాక్టర్ నూర్ జీలానీ వైద్య సలహా మేరకు ఈ శస్త్ర చికిత్సను జరిపారు. దీని ప్రకారం చివరి రెండు ఆఫరేన్లు జరిగాయి. 33 గంటల పాటు ఈ ఆపరేషన్ చేశారు. ఇందులో వందమందికి పైగా డాక్టర్లు పాల్గొన్నారు.

చిన్నారులకు సంబంధించిన ఈ శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. రెండు తలలు అంటిపెట్టుకొని పుట్టిన తల్లిదండ్రులు రెండున్నరేళ్ల కిందట బ్రెజిల్ వైద్య శాలకు వచ్చారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న లండన్ డాక్టర్లు వీరికి ఆపరేషన్ చేసుందుకు ముందుకు వచ్చారు. అంతకుముందు ఈ ఆపరేషన్ కోసం స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బుులు కలెక్ట్ చేశారు. అయితే డబ్బులు ఇచ్చేవారు నిజంగానే మీరు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేస్తారా..? అని ప్రశ్నించారు.

కానీ ఎంతో శ్రమపడిన వైద్యులు వారి తలలను వేరు చేశారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు బాగానే ఉన్నారు. ఇక తెలంగాణకు చెందిన వీణ వాణిలకు ఇదే సమస్య. వీరి ఆపరేషన్ కోసం డబ్బులు వసూలవుతున్నా.. శస్త్ర చికిత్స కోసం వైద్యులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం వీరు స్టేట్ హోంలో ఉంటున్నారు. ఇప్పటి వరకు వారు ఒకరి ముఖం మరొకరు చూసుకోలేదు. ఒకరు ఒకవైపు ఉంటే..మరొకరు ఇంకోవైపు చూస్తారు.

Leave a Comment