పూర్వకాలంలో గర్బధారణ గురించి ఎలా తెలుసుకునేవారంటే..?

సాధారణంగా ప్రెగ్నెన్సీ విషయాన్ని నేటి మహిళలు కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకుంటున్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదిస్తున్నారు. కానీ ఒకప్పుడు విచిత్ర పద్ధతుల ద్వారా గర్భనిర్దారణ చేసుకునేవారు. మూత్రంలో రంగును భట్టి గర్భం దాల్చారో లేదో తెలుసుకునేవారట. ఇలాంటి మరికొన్ని పద్ధతుల గురించి తెలుసుకోవాలని ఉందా..

ప్రతి కుటుంబంలో వారసుడు లేదా వారసురాలు వస్తుందంటే ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక మహిళకు గర్భధారణ ఐదోతనం అంటారు. జీవితంలో తల్లి కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కడం లేదు. నేటి కాలంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలంటే అనేక శాస్త్రీ పద్ధతులు ఉన్నాయి. మహిళలు తాము ప్రెగ్నెన్నీనో కాదో తెలుసుకోవాలంటే మెడికల్ కిట్స్ అనేకంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే పురాతనకాలంలో ఇలాంటి అవకాశాలు లేవు. ఒక మహిళ గర్భధారణ నుంచి బిడ్డ జన్మించేవరకు గోప్యంగా ఉంచేవారు. కొందరు మహిళలు తమ అనుభవాల ద్వారానే గర్భధారణ చేసేవారు. అయితే అసలు ఒక మహిళ తాను తల్లికాబోతున్న విషయాన్ని కొన్ని దేశాలకు చెందిన వారు చాలా విచిత్రమైన పద్ధతులను అవలంభించేవారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు.

తాళపు అచ్చు పడితే..
పూర్వంలో అ సమయంలో ఉన్న సౌకర్యాలను భట్టి కొన్ని పనులను చేసుకునే వారు. గర్భం వచ్చిదా ..? లేదా..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి 15వ శతాబ్ధంలో ఒక విచిత్ర పద్ధతిని అవలంభించేవారు. ఒక గిన్నెలో మహిళకు సంబంధించిన మూత్రాన్ని పోసేవారు. అందులో ఒక తాళం చెవి వేసి, మర్నాడు దానిని పరీక్షించేవారు. ఆ తాళం చెవి అచ్చు పడితే మహిళ గర్భం దాల్చిందని భావించేవారు. అయితే ఇప్పటి వైద్యులు అది అనాలోచిత నిర్ణయమని అంటున్నారు.

ఉల్లిపాయ స్మెల్ తో..:
గ్రీకుల జీవన విధానం గురించి ఇప్పటికే పుస్తకాల్లో చదివి ఉంటారు. గర్భం గురించి తెలుసుకోవడానికి కూడా వారు ప్రత్యేక పద్ధతిని పాటించేవారు. మర్మాయవాల వద్ద ఉల్లిపాయను ఉంచేవారు. మరుసటి రోజు నోటి నుంచి ఉల్లిపాయ స్మెల్ వస్తే ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ చేసేవారు. ఉల్లిపాయతో లోపల పిండం మొత్తం గొట్టంలా తెరుచుకొని పనిచేస్తుందని అనుకునేవారు.

కంటిలో మార్పులు రావడంతో..:
16వ శతాబ్ది వైద్యులు జాక్ గిల్మవు మహిళల్లో జరిగే కొన్ని మార్పుల ద్వారా గర్భధారణ గురించి తెలుసుకునేవారు. గర్భం దాల్చిన వ్యక్తికి రెండో నెలలో కంట్లో మార్పులు వస్తాయని నమ్మేవారు. అయితే సాధారణ మహిళ్లలోనూ ఇలాంటి మార్పులు ఉంటాయని నేటి వ్యైద్యులు ధ్రువీకరిస్తున్నారు.

మూత్రం రంగును భట్టి:
మూత్రంలో రంగును భట్టి కూడా గర్భం దాల్చిన విషయాన్ని చెప్పేవారు. అంతేకాకుండా ఆడో, మగో కూడా చెప్పేవారట. కొందరు మూత్రాన్ని ద్రాక్ష రసంలో వేసి అది పారదర్శకత కోల్పోతే గర్భిణీ అని భావించేవారట.

ఎక్కువ రక్త ప్రసరణ వల్ల:
మర్మాంగాల వద్ద ఎక్కువ రక్త ప్రసరణ కావడంతో రంగులు మారుతుందని 1836లో ప్రెంఛ్ వైద్యుడు జేమ్స్ చాడ్విక్ తెలిపాడు. అయితే ఇది అందరికీ సాధ్యమయ్యే పరీక్ష కాదు. ఆ కాలంలో పరిస్థితలను భట్టి నిర్దారించేవారు.

Leave a Comment