తల్లి పాత్రలు చేసే పవిత్రా లోకేశ్ ఒకప్పుడు హాట్ హీరోయిన్.:ఎలాగో చూడండి..

మన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక సినిమాలో వారి నటన ఆకట్టుకుంటే వారికి వివిధ సినిమాల్లో అవకాశాలు వస్తాయ. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయడానికి ప్రత్యేకంగా ఇండస్ట్రీకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వారే మళ్లీ నటిస్తున్నారు. తల్లిగా, అత్తగా, అక్కగా.. ఇలా ఏ పాత్ర చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇప్పుడున్న సినిమాల్లో ఎక్కువగా తల్లీ, అత్త పాత్రలు చేస్తున్న వారిలో పవిత్రా లోకేశ్ ఒకరు. పవిత్రా లోకేశ్ ఇప్పుడు సాంప్రదాయంగా కనిపిస్తున్న ఒకప్పడు గ్లామర్ హీరోయిన్ అన్న విషయం కొందరికే తెలుసు. కొన్ని సినిమాల్లో హాట్ సన్నివేశాల్లో కూడా నటించారు. ఆ విశేషాలేంటో చూద్దాం..

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో 1979లో జన్మించారు పవిత్రా లోకేశ్. సినిమాలపై ఆసక్తి ఉన్న ఆమె అంబరీస్ సలహా పై ‘మిస్టర్ అభిషేక్’ అనే సినిమాలో మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత ఆదే సంవత్సరంలో బంగారద కలశ లోనూ నటించింది. అయితే వరుసగా కొన్ని సినిమాల్లో ఆమె నటించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె మానవ వనరుల సలహా సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. ఈ సమయంలో 1996లో విడుదలైన జనుమాద జోడిలోనూ కనిపించింది.

1971లో వచ్చిన కామెడీ సినిమా ఉల్టా పల్టాలోనూ అమెకు అవకాశం వచ్చింది. ఇందులో పవిత్రా లోకేశ్ అందాలు ఆరబోసి ఆకట్టుకుంది. అప్పటికే యంగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె ఇందులో కాస్త గ్లామర్ పాత్ర పోషించడంతో అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. అయితే ఆ తరువాత మరికొన్ని సినిమాల్లోనూ పవిత్ర కాస్త గ్లామర్ పాత్రలే పోషించింది. ఇక తెలుగులో ఆమె దొంగోడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తల్లి పాత్రలను పోషించడం మొదలు పెట్టింది. ఇలా పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు టీవీ సీరియళ్లలోనూ ఆకట్టుకుంది.

ఇక రీసెంట్ గా పవిత్రా లోకేశ్ , నరేశ్ వ్యవహారం చర్చేనీయాంశంగా మారింది. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయతే పవిత్రా లోకేశ్ సుచేంద్రప్రసాద్ ను 2007లోనే పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా నరేశ్ ను రెండో వివాహం చేసుకుంటారని అంటున్నారు. అయితే ఈ విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవల నరేశ్ భార్య ఈ జంటపై మైసూర్ లో దాడికి యత్నించిన విషయం తెలిసిందే.

https://youtu.be/2GQT0fQz5UE

Leave a Comment