గోపీచంద్ భార్య ఓ ప్రముఖ నటుడి బంధువు అని తెలుసా..?

సినీ ఇండస్ట్రీకి ఎన్నో కలలతో వస్తాం. అన్నింటికంటే ముఖ్యంగా హీరో అవ్వాలని ఎవరికైనా కోరిక ఉంటుంది. కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది. అయితే సినీ బ్యాక్రౌండ్ ఉన్నా తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు గోపీచంద్. కానీ కొందరి బలవంతంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సినిమాల్లో హీరోగా నటించి ఆ తరువాత విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటన అని గోపిచంద్ నిరూపించాడు. అయితే గోపీచంద్ పర్సనల్ విషయాలపై ఎక్కువగా మీడియాలో రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.

ప్రముఖ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడైన గోపీచంద్ ‘తొలివలపు’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఆయన ఫిజిక్ చూసి డైరెక్టర్ తేజ ‘జయం’ సినిమాలో విలన్ గా అవకాశం ఇచ్చాడు. అయితే అప్పటికే హీరోగా కొనసాగుతున్న ఆయన విలన్ గా చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాకుండా విలనిజం పాత్రకు వన్నెతెచ్చాడని చెప్పొచ్చు. ఆ తరువాత వర్షం సినిమాలోనూ గోపిచంద్ మరోసారి విలన్ గా నటించి మెప్పించాడు. ఇక జయం సినిమాలో విలన్ గా నటించినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.

కానీ హీరో కావాలన్న ఆశతో సొంత బ్యానర్ ‘ఈతరం ఫిలిమ్స్’ నుంచి ‘యజ్ఒం’ సినిమా ద్వారా మరోసారి హీరో అయిన గోపీచంద్ ఆ తరువాత వరుస సినిమాలు చేశాడు. ఆ తరువాత చేసిన రణం సినిమాతో గోపీచంద్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. యాక్షన్, కామెడీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా హీరోకుండే లక్షణాలన్నీ గోపీచంద్ లో ఉన్నాయి. ఇక గోపీచంద్ పర్సనల్ విషయాలకొస్తే 1979 జూన్ 12న ఒంగోలులో జన్మించాడు. ఆ తరువాత చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తరువాత రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సినీ ఇండస్ట్రీకి వచ్చాడు.

సినిమాల్లో మంచి పొజిషన్లో ఉండగానే రేష్మ అనే అమ్మాయిని 2013 మే 12న పెళ్లి చేసుకున్నాడు. రేష్మ ఎవరో కాదు శ్రీకాంత్ మేనకోడలు. శ్రీకాంత్ సొంత అక్క కూతురు రేష్మ. రేష్మ అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంది. పెళ్లయిన తరువాత వీరు అన్యోన్యంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే వీరి పెళ్లి అనుకోకుండా జరిగింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో చూసిన గోపీచంద్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.

Leave a Comment