పుష్ప లోని ఆ డైలాగ్ వెనుక అంత స్టోరీ ఉందా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సీక్వెల్ కూడా రెడీ కాబోతుంది. తెలుగులో రిలీజైన పుష్ప పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోయింది. అంతేకాకుండా ఇందులో ఉండే డైలాగ్స్ ఇప్పటికీ కొందరు స్టార్ క్రికెటర్లు సైతం అనసరిస్తున్నారు. మంచి మాస్ యాంగిల్ లో వచ్చిన ఈ మూవీ ప్రతీ యాంగిల్ సెన్సేషనే ని చెప్పాలి. ఈ నేపథ్యంలో పుష్పలోని పవర్ ఫుల్ డైలాగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అదే ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’అనే డైలాగ్ ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ డైలాగ్ వెనుక పెద్ద స్టోరే ఉందట. ఆ స్టోరీ గురించి ఇప్పుడు చర్చిద్దాం..

పుష్ప మూవీ మేకింగ్ కు ముందు అల్లు అర్జున్ ను ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ కలివారట. ఈ సందర్బంగా తాను పుష్ప సినిమా చేయబోతున్నట్లు తెలిపాడట. అయితే ఈ సినిమా కు పుష్ప అని పేరు పెట్టారని తెలియగానే.. ఇదేంది.. ఇది ఆడవాల్ల పేరులా ఉంది. మరీ సాఫ్ట్ గా ఉంది.. అని చెప్పాడట. ఇలా సాఫ్ట్ గా ఉంటే జనాల్లోకి వెళుతుందా..? అని హరీశ్ శంకర్ అనుమానం వ్యక్తం చేశాడట. దీంతో అల్లు అర్జున్ అసలు విషయం చెప్పాడట.

‘పుష్ప అంటే సాఫ్ట్ పేరు కాదు.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్..’ అని సుకుమార్ తనతో చెప్పాడని బన్నీ హరీశ్ శంకర్ కు వివరించాడట. దీంతో అప్పటి నుంచే ఈ డైలాగ్ బయటికి వచ్చినట్లు సమాచారం. ఆ తరువాత ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాల్లోని మిగతా డైలాగ్స్ కంటే ఈ డైలాగ్ మరీ పాపులర్ కావడంతో ఇతర సందర్భాల్లోనూ కూడా దీనిని వాడుతున్నారు. ఇక ఈ డైలాగ్ తో పాటు తగ్గేదేలే కూడా చాలా పాపులర్ అయింది.

ఇక ఈ సినిమా సీక్వెల్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుపుతున్నారు. అయితే పుష్ప పార్ట్ వన్ కంటే 2 భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని క్యారెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉంది. ఇక పుష్ప మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవల్లో హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ఉత్తరాదిలో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. మరి పుష్ప 2లో ఎలాంటి భారీ డైలాగ్స్ ఉంటాయో చూద్దాం..

Leave a Comment