‘ఛత్రపతి’ చంద్రశేఖర్ భార్య మనకు తెలిసిన నటినే..: ఎవరో చూడండి..

సినిమా ఇండస్ట్రీకి కొందరు కొన్ని ప్రత్యేక పాత్రల కోసమే వస్తారా..? అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే వారు పోషించి పాత్రల్లో ఇతరులను ఊహించుకోలేం. అలాగే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ‘భద్రం’ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రలో చంద్రశేఖర్ అనే వ్యక్తి నటించారు. ఇక్కడ ఆయన తప్ప వేరే వారు ఉన్నా సెట్ కాకపోవచ్చు అనిపిస్తుంది. అంతలా నటించారు చంద్రశేఖర్. రాజమౌళి తీసే ప్రతీ సినిమాలో ఉన్నచంద్రశేఖర్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయితే బాహుబలిలో మాత్రం నటించలేదు. అందుకు ఓ కారణం ఉంది. ఆ విషయం పక్కనబెడితే చంద్రశేఖర్ పర్సనల్ విషయాలు ఎప్పుుడూ బయటకు రాలేదు. ఇటీవల ఆయన సతీమణి గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయన భార్య కూడా ఇండస్ట్రీకి చెందిన నటినే.

అంతకుముందు సీరియళ్లలో నటించిన చంద్రశేఖర్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. బోయపాటి సినిమా.. రవితేజ హీరోగా వచ్చిన భద్రం సినిమాతో గుర్తింపు వచ్చింది. ఆ తరువాత రాజమౌళి సినిమాలన్నింటిలోనూ నటిస్తున్న ఆయన ‘ఛత్రపతి’ సినిమా స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. దాదాపు జక్కన్న సినిమాలన్నింటిలోనూ నటించిన ఆయన బాహుబలిలో మాత్రం కనిపించలేదు. అయితే బాహుబలిలోనూ చంద్రశేఖర్ నటించారు. కానీ ఆయన పాత్ర సినిమానే డిస్ట్రబ్ చేయడంతో పక్కనబెట్టారు. అంతేకాకుండా ఆ పాత్రకూడా చంద్రశేఖర్ కు నచ్చకపోవడంతో బాహుబలి నుంచి తప్పుకున్నారు.

ఇక చంద్రశేఖర్ పర్సనల్ విషయానికొస్తే ఆయన సతీమణి పేరు విలియా భవాని. ఈమె ఎక్కువగా సీరియళ్లలో నటించింది. అంతేకాదు కొన్ని సినిమాల్లోనూ మెరిసింది. పండగ చేస్కో, కిక్ 2, సైరా, నాని జెంటిల్ మెన్ వంటి చిత్రాల్లో నటించింది. చంద్రశేఖర్, విలియా భవాని సీరియళ్లలో కొనసాగుతున్న సమయంలోప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఆమె సతీమణి కూడా ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం ఎవరూ గుర్తుపట్టలేదు.

క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో చంద్రశేఖర్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించేది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎక్కువగా సైడ్ విలన్ పాత్రలు చేసినా.. కొన్ని సినిమాల్లో కామెడీ విలన్ గా కూడా నటించాల్సి వచ్చింది. కానీ తన జీవితంలో ఛత్రపతి లాంటి సినిమా మరోటి లేదని ఆయన అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఇంకనూ చంద్రశేఖర్ మరెన్నో సినిమాల్లో నటించాలని ఆశిద్దాం..

Leave a Comment