వడ్డే నవీన్ భార్యను చూస్తే ఆశ్యర్యపోకుండా ఉండలేరు..

‘కొంగుపట్టి లాగాడే.. కోరుకున్నప్రియుడు’ ఈ సాంగ్ ఇప్పటికీ సినీ ప్రియుల మదిలో కదలాడుతుంది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో కాదు వడ్డే నవీన్. వడ్డే నవీన్ మొదటి సినిమాతోనే ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని పలు ప్రేమ చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు పంది కుటుంబ సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ఇక వడ్డే నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత. అయినా నవీన్ యాక్టింగ్ తో సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించిన ఆయన చివరగా ‘ఎటాక్’ సినిమాలో కనిపించాడు. ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల వడ్డే నవీన్ సతీమణి గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం..

1976లో కృష్ణా జిల్లాలోని ఎలమర్రోలో వడ్డేనవీన్ జన్మించాడు. ఈయనకు ఓ చెల్లె కూడా ఉంది. వడ్డే నవీన్ చదువంతా చెన్నైలోనే సాగింది. ఆయన మొదటిసారిగా ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాలో నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్. ఆ తరువాత పెళ్లి, మనసిచ్చిచూడు, తదితర సినిమాల్లో నటించాడు. ఇలా వరుసగా ప్రేమ చిత్రాల్లో నటించడం వల్ల లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. ఆ తరువాత మా ఆవిడమీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది.., చాలా బాగుంది లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే 2001 తరువాత ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయినా చివరిగా ఎటాక్ అనే సినిమాలో నటించాడు. ఆ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. కొన్ని సినిమాల్లో శ్రీకాంత్ తో కలిసి సైడ్ రోల్ లో కూడా నటించి మెప్పించాడు. శ్రీకాంత్ తో కలిసి దాదాపు రెండు, మూడు సినిమాల్లో నటించాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఇక చివరి వరకు హీరోగానే నటించిన ఆయన ప్రస్తుతం అవకాశం వస్తే నటించడానికి రెడీగా ఉన్నా

వడ్డే నవీన్ ఫ్యామిలి విషయానికొస్తే.. ముందుగా ఆయన నందమూరి వంశంలోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాముండేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత కొన్నిరోజుల పాటు సాఫీగానే ఉండేది. కానీ ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. కానీ ఆ తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో ప్రస్తుతం హ్యీపీగా ఉన్నాడు. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. వడ్డే నవీన్ సినిమాలు చేస్తున్న సమయంలో ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ ఉండేవారు. ప్రస్తుతం వారు వడ్డే నవీన్ ను వెండితెరపై చూడాలని కోరుకుంటారు.

Leave a Comment