ఈమె చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే.. వైరల్

గొప్ప వాళ్ళు అనిపించుకోవటం అంత కష్టం కాదు.మంచి మనసు ఉంటె ఎవరికైనా సాధ్యం.. ఇప్పుడు ఒక మహిళ చేసిన పనికి ప్రసంసల జల్లు కురుస్తోంది.పేదల ఆకలిని తీర్చి అన్నపూర్ణ అయ్యింది. మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి అందరికి తానె స్వయంగా పంచి గ్రేట్ అనిపించింది. బెంగాల్ కు చెందిన ఓ మహిళ భిన్నంగా ఆలోచించి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె చెసిన పనికి సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గొప్ప మనసు మీది అంటూ నెటిజన్లు ఆ మహిళను ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చేసిన ఆ మంచి పని ఏంటో చూద్దాం..

నిన్న ఉదయం కోల్ కతాలోని రానాఘాట్ రైల్వే స్టేషన్ దగ్గరకి సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో వెళ్లిన ఓ మహిళ.. తన సోదరుడి వివాహంలో మిగిలిపోయిన ఆహారాన్ని రైల్వే ఫ్లాట్ ఫాంపై ఉన్న పేద ప్రజలకు పంచింది. రైల్వే ఫ్లాట్ ఫాంపై కూర్చొని పేపర్ ప్లేట్స్ లో ఆమె స్వయంగా ఆహారాన్ని వడ్డించి వాళ్ల ఆకలిని తీర్చింది.ఈ విషయాన్ని చూసిన ఓ ఫోటో గ్రాఫర్ ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు కూడా ఒకసారి చూడండి..

Leave a Comment