సన్నాఫ్ సత్యమూర్తి చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా ఉందో తెలుసా..?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేసన్లో వచ్చిన సినిమాలు దాదాపు సక్సెస్ అయ్యాయి. ఇందులో సన్నాఫ్ సత్యమూర్తి మిక్స్డ్ట్ టాక్ తెచ్చుకుంది. ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎక్కువగా ఎమోషనల్ చూపించారు. అప్పటి వరకు పంచ్ డైలాగ్ లతో ఆకట్టుకునే మాటల మాంత్రికుడు ఈ సినిమాలో సెంటిమెంట్ ను పండించడం విశేషం. అయితే ఇందులో బన్నీకి జోడీగా సమంత నటించింది. ప్రత్యేక పాత్రలో నిత్యామీనన్ అలరిస్తూ ఉంటుంది. ఇక బన్నీ ఫ్యామిలీలో ఓ చిన్నారి కూడా కనిపిస్తుంది. ముద్దుగా ఉండే ఆ చిన్నారి పేరు వర్ణిక.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తరువాత వర్ణిక మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఆమె తల్లిదండ్రు చదువుపై దృష్టి సారించాలని మళ్లీ సినిమాల్లోకి పంపించలేదు. అయితే వర్ణికకు సంబంధించిన ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపించి వర్ణిక ఆ తరువాత కాస్త బొద్దుగా మారినట్లు తెలుస్తోంది. పరికిణిలో ఉన్న వర్ణిక చాలా అందంగా కనిపిస్తోంది. అయితే మళ్లి సినిమాలో నటిస్తారా..? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి స్పందన లేదు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వర్ణిక ను సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ప్రత్యేకంగా చూపించారు. అల్లు అర్జున్ కు అన్న కూతురుగా నటించిన ఈమె సింధు తులానీకి కూతురుగా నటించింది. తన సింధు తులానీకి భర్తగా వెన్నెల కిశోర్ నటించారు. ఈ ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ప్రత్యేకత ఉంది. అలాగే వర్ణిక పాత్రనూ స్పెషల్ గా చూపించారు. ఆమె స్కూల్ ఫీజు కోసం బన్నీ కన్నీళ్లు తెచ్చుకోవడం ఎమోషనల్ తెప్పిస్తుంది. అక్కడితో సినిమా స్టోరీ కీలక మలుపు తిరుగుతుంది.

ఇలా సినిమాలో కంట తడి పెట్టించిన వర్ణిక పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా రావాలని కోరుకుంటున్నారు. అయితే అప్పటి వరకు ఇండస్ట్రీలో ఎలాంటి పోటీ ఉంటుందో చెప్పలేమని మరికొందరు అంటున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన వాళ్లు హీరోయిన్ గా రాణించారు. మరి వర్ణిక రాణిస్తుందా..? లేదా..? చూడాలి.

Leave a Comment