చిరు ‘జై చిరంజీవా’ చైల్డ్ ఆర్టిస్టు ఇంత అందంగా మారిందా..?

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన వారు ఆ తరువాత హీరోయిన్ గా సెటిలయ్యారు. కానీ ఈ అదృష్టం అందరికీ వర్తించలేదు. చిన్నారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు పెద్దయ్యాక వారిని ఆదరించలేదు. బేబీ షామిలి లాంటి వాళ్లు చిన్నప్పుడు సినిమాల్లో క్యూట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కానీ బేబీ షామిలి పెద్దయ్యాక హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. ఆమెలాగే మరో అమ్మాయి సినిమాల్లోకి ఎన్నో ఆశలతో అడగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా రాణించినంతగా.. హీరోయిన్ గా ఆకట్టుకులేకపోయింది. దీంతో ఆ భామ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన లెటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటించిన వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక ఆయన సినిమాల్లో కీలకంగా ఉన్నవారికి మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోరు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చిన చిరు ‘జై చిరంజీవా’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన ఈ సినిమా ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన మేనకోడలిని చంపిన వారిపై పగ తీర్చుకునేందుకు చిరు విదేశాలకు సైతం వెళ్తారు. అయితే చిరు మేనకోడలిగా నటించిన అమ్మాయి పేరు శ్రియా శర్మ. ఈమె ఈ సినిమా కంటే ముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూర్య-జ్యోతిక లసినిమా ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రంలో వారి కూతురిగా నటించింది. తన నటనతో ఆకట్టుకున్న శ్రియ తెలుగులో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ తరువాత దూకుడు సినిమాలోనూ హీరోయిన్ కు చెల్లెలిగా నటించింది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయం చేసిన ‘నిర్మల కాన్వెంట్ ’ సినిమాలో ఆయనకు జోడిగా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ‘గాయకుడు’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇందులో బిగ్ బాస్ ఫేం ఆలీ రాజా హీరో.

చైల్డ్ ఆర్టిస్టుగా సక్సెస్ సినిమాల్లో నటించిన శ్రియా.. హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోతోంది. దీంతో తాజాగా తనకు సంబంధించిన హాటెస్ట్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. అందాల ఆరబోతలో ఆకట్టుకున్న ఈ అమ్మాడు మిగతా హీరోయిన్లకు పోటీ ఇస్తానని చెబుతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో అలరించింది శ్రియా. మరి ఈ భామకు సక్సెస్ సినిమా ఏ ఇండస్ట్రీ ఇస్తుందో చూడాలి.

Leave a Comment