‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ వాయిదా పై ఫన్నీ ట్రోలింగ్‌..

ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం ట్రిపుల్ ఆర్..విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి పెద్ద షాక్‌ ఇచ్చింది జక్కన్న టీం. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మోస్ట్‌ అవేటెడ్ మూవీ మరోసారి వాయిదా పడి అభిమానులు, సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే రిలీజ్‌ వాయిదాకు కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, థియేటర్‌ ఆక్యుపెన్సీలో ఆంక్షలతో సినిమా వాయిదా వేసేందుకే చిత్ర యూనిట్‌ నిర్ణయించుకుంది.

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసిన చిత్రయూనిట్‌ ఒమిక్రాన్‌ ఉధృతి వల్ల ఈ నెల 7న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలను నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదలకు ఆరు రోజుల ముందు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నెటిజన్లు ఆర్‌ఆర్‌ఆర్‌పై ట్రోలింగ్‌తో దండయాత్ర మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో ఈ ట్రోలింగ్‌ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లను తలపిస్తున్నారు. ఎన్టీఆర్‌, రాజమౌళి తదితర సినిమాల వీడియో క్లిప్‌లను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా సందర్భానికి సింక్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

Leave a Comment