మరో క్రేజీ సినిమాలో నటించనున్న నాని..

తెలుగు అగ్ర హీరోలలో ఇప్పుడు ప్రముఖ వినిపించే పేరు న్యాచురల్ స్టార్ నాని.. గత రెండు సినిమలతో మంచి టాక్ అందుకొని నానికి ఇప్పుడు వచ్చిన సినిమా మంచి హిట్ ను అందించింది. అదే శ్యామ్ సింగరాయ్‌.. రాకుల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా లో నానికి ఇది బెస్ట్ గా నిలిచింది..ఈ సినిమా లో సన్నీవేశాలు అన్నీ ప్రేక్షకులను బాగా అలరించాయి..దాంతో సినిమా జనాలను మెప్పించింది.

న్యూ ఇయర్ స్పెషల్‌గా తన అభిమానుల కోసం ఓ క్రేజీ అప్‌డేట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత నాని చేస్తున్న మూవీ ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ వై నిర్మిస్తున్నారు. నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నాని లుక్‌ని జనవరి 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా నానికి ఎంత హిట్ ను ఇస్తుందొ చూడాలి.

Leave a Comment