ఈ చిన్ని చిట్కాలతో నిమిషాల్లో దగ్గు మాయం..

చలికాలంలో అనేక రోగాలు వస్తాయి..ఈ విషయం గురించి ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాము.. అయితే ఇప్పుడు వెంటనే దగ్గును తగ్గించె మరి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..జలుబు, దగ్గు,తుమ్ములు వస్తాయి. వీటికి తోడు వైరల్ ఫీవర్ కూడా వస్తుంది. దగ్గు ఒక్కసారి వచ్చిందంటే దానిని నివారించడం చాలా కష్టం.దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని బాగా మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఆ నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్దిగా కొద్దిగా తీసుకోవడం ఉత్తమం..

తులసి ఆకులు, అల్లం, మిరియాలు వీటిని బాగా వేడి నీటిలో మరిగించి, దాని కషాయాన్ని తాగడం ద్వారా దగ్గు నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది.రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో కి చిటికెడు పసుపు కలుపుకుని తాగడం ద్వారా దగ్గు తగ్గుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ యాంటీ బ్యాక్టీరియా దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. బాగా మరిగే నీటిలో అయిదారు చుక్కల పుదీనా ఆయిల్ కలిపి ఆవిరి పట్టడం ద్వారా గొంతులో ఉన్న కఫము తొలగి దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

Leave a Comment