Bhanupriya:హీరోయిన్ భానుప్రియ కూతురు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన గొప్ప నటీమణి భానుప్రియ(BHANUPRIYA).ఈ హీరోయిన్ అందం ముందు చాలామంది హీరోయిన్లు దిగదుడుపే అనే మాట అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవారు. తన అందం, అభినయం తో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతారా గా పరిచయమైన ఈ హీరోయిన్ తనలోని నాట్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసి దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్గా వెలిగింది.

తెలుగు, తమిళ్, మలయాళం,బాలీవుడ్ ఇండస్ట్రీలలో 1980 నుంచి 90 వరకు దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలింది.భానుప్రియ(Bhanupriya) తన అందం అభినయంతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అయినా ఆదర్శ్ కౌశల్(Adarsh koushal) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఈమెకు పెళ్ళై ఒక పాప పుట్టింది.ఈమె కూతురు పేరు అభినయ కౌశల్.

కూతురు పుట్టాక ఏమో మనస్పర్ధలు వచ్చి భర్త నుండి దూరంగా వచ్చేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రియంట్రి ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ లో తల్లి, వదినె,అత్త పాత్రల్లో నటిస్తోంది. చత్రపతి, గౌతమ్ ఎస్ఎస్సి,అన్నమయ్య, మహానటి (Mahanati)వంటి సినిమాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక అలాంటి స్టార్ హీరోయిన్ భానుప్రియ కూతురు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అభినయ కౌశల్..ఈ అమ్మాయికి ఇప్పుడు 19 సంవత్సరాలు.

ఈమె కూడా తల్లిలాగే చాలా అందంగా తయారైంది. అంతేకాదు ఈమె భానుప్రియ (Bhanupriya)లాగే డాన్సర్. చిన్నప్పటినుండే డాన్స్ నేర్చుకుంది. ఇక భానుప్రియ కూతురు అభినయ కౌశల్(Abhinaya koushal) కూడా తన తల్లిలాగే సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా మెప్పించెనుందో లేదో ముందు ముందు తెలుస్తుంది. కానీ అభినయ ను చూస్తే మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుందని అనుకోవచ్చు అలా ఉంది ఆమె అందం.

Leave a Comment