మతి పోగొడుతున్న నిత్యామీనన్ అందాలు..

మలయాళ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో చాలా మందే ఉన్నారు. కేరళ నుంచి వచ్చే బ్యూటీలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. అందుకే కొత్త హీరోయిన్లను పరిచయం చేయాలనుకునేవారు కేరళ వైపు చూస్తారు. మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ అయిన హీరోయిన్ నిత్యామీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆ తరువాత పలు సక్సెస్ సినిమాల్లో నటించింది. తన ఘాటు డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ అమ్మడు మంచి సినిమాలే చేసింది. అయితే ఈ మధ్య మిగతా హీరోయిన్ల మాదిరిగా ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము లేపుతోంది.

నిత్యామీనన్ కు చెందిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. బ్రౌన్ ఫ్రాక్ లో ఉన్న ఈ భామను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నిత్యామీనన్ ను చూసి అక్కడున్నవారు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు ఈమె కేవలం సాంప్రదాయ దుస్తుల్లోనే దర్శనమిచ్చింది. ఒక్కసారి హాట్ డ్రెస్ లో నిత్యామీనన్ ను చూసేసరికి తట్టుకోలేకపోయారు. కొందరు ఈ అరుదైన దృశ్యం మళ్లీ దొరుకుతుందో లేదో.. అన్నట్లుగా వెంటనే తమ సెల్ ఫోన్లు తీసి వీడియో షూట్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

సాధారణంగానే సోషల్ మీడియాలో నిత్యామీనన్ కు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ వీడియో చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ సాంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ ఒక్కసారిగా తన అందాలను ఆరబోయడం చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. తెనే కలిపిన మాటలు మాట్లాడే నిత్యామీనన్ ఈ డ్రెస్సులో ఏమాత్రం సిగ్గు పడడం లేదు. పైగా అక్కడున్న వారికి ఫ్యాషన్ షో అన్నట్లుగా వీడియో, ఫొటోలకు ఫోజులిచ్చింది.

మొదట్లో నిత్యా మీనన్ కొన్ని సినిమాల్లో కాస్త హద్దుల్లో నటించినా.. ఆ తరువాత రెచ్చిపోవడం మొదలెట్టేసింది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో ఈమె రొమాన్స్ సీన్లకు కూడా ఒప్పేసుకుంటోంది. సహజంగా ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నిత్యామీనన్ తనకంటూ ఓ స్టైల్ ను అలవరుచుకుంది. అయితే ప్రతీ సినిమా కథ నచ్చితేనే నిత్యా ఒప్పుకుంటుందట. ఇప్పటి వకు హర్రర్, థ్రిల్లర్ సినిమాలు చేసేందుకు అవకాశం వచ్చినా ఒప్పుకోలేదట.

Leave a Comment