హైదరాబాద్ – బెంగుళూరు గంటకు 200 కి.మీ. వేగంతో రైలు..

హైదారాబాద్, బెంగుళూరు మధ్య నిత్యం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రైళ్లల్లో, బస్సుల్లో.. వీలు కాకపోతే ప్రత్యేకమైన వాహనాల్లో వస్తూ.. పోతూ.. ఉంటారు. అయితే రైళ్లో వెళితే సౌకర్యంగా ఉంటుంది. కానీ సమయానికి అందుబాటులో ట్రైన్స్ ఉండవు. అంతేకాకుండా ట్రైన్ జర్నీ చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నగరాల మధ్య మరింత వేగంగా రాకపోకలు సాగించేందుకు రైల్వేశాఖ కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు చేరుకోవాలంటే 10 గంటల సమయం పట్టేంది. కానీ రెండున్నర గంటల సమయం తగ్గించేలా సెమీ హైస్పీడ్ ట్రాక్ ను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రైల్వే శాఖ ఇటీవల సెమీ హైస్పీడ్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందుకు సంబంధించిన ట్రాక్స్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. రూ. 30 వేల కోట్లతో రైల్వేలైన్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు సెమీ హైస్పీడ్ ట్రైన్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ మధ్య సెమీ హైస్పీడ్ రైళ్ల ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ట్రాక్ వేసేందుకు ప్లాన్ వేస్తున్నారు.

ప్రతీరోజుల రైళ్లు వందల కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి. తాజాగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ట్రాక్ తో హైదరాబాద్, బెంగుళూరు మధ్య రెండున్నర గంటల సమయం ఆదా అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే 10 గంటల మయం పట్టేంది. ఈ ట్రాక్ పూర్తయితే ఏడున్నర గంటల్లో గమ్యానికి చేరుకోవచ్చు. ఈ ట్రాక్ ను బెంగుళూరు శివారులోని యలహంక నుంచి సికింద్రాబాద్ వరకు వేసే అవకాశం ఉంది. ఈ ట్రాక్ మధ్య దూరం 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

బుల్లెట్ ట్రైన్ ను తీసుకొచ్చిన కేంద్ర రైల్వేశాఖ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. అహ్మదాబాద్ -ముంబై మధ్య బుల్లెట్ ట్రాక్ నిర్మాణం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ ను నడించే అవకాశం ఉంది. అవసరాన్ని భట్టి హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగుళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలును తీసుకురానున్నారు. ఆ తరువాత మరికొన్ని ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Leave a Comment