శ్రీకృష్ణుడు వెన్నను దొంగిలించడం వెనుక ఇంత కథ ఉందా..?

సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు. ఇక్కడున్న ప్రతీ సంస్కృతి వెనుకో పరమార్థం దాగి ఉంటుంది. పురాతన కాలంలో జరిగిన పరిస్థితులు ఆచారాలను భట్టి దేశ ప్రజలు వారి మతాలకు అనుగుణంగా పండుగలు నిర్వహించుకుంటారు. అనేక పండుగలు జరుపుకునే హిందువులు శ్రీకృష్ణాష్టమిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలను భట్టి తెలుస్తుంది. శ్రీకృష్ణ కాలంలో జరిగిన విశేషాలను కొందరు నేటి ప్రజలకు రకరకాల మార్గాల ద్వారా తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడి పేరు ఎత్తగానే గుర్తుకు వచ్చేది.. ఆయన వెన్నను దొంగిలించేవాడని అంటారు. చిన్నిప్పుడు అందరి ఇళ్లలో దాచుకున్న వెన్నను వారికి తెలియకుండా తినేవాడు. ఆ తరువాత వారు శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చి యశోధకు ఫిర్యాదు చేసేవారిన పుస్తకాల్లో ఉంది. ఇంతకు శ్రీకృష్ణుడు వెన్నను ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది..? వెన్నను దొంగిలించడంలో ఉన్న పరమార్థం ఏంటి..? ఇప్పుడు తెలుసుకుందాం..

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని కొన్ని మార్గాల ద్వారా జయించవచ్చని భగవద్గీత చెబుతుంది. అలాగే శ్రీకృష్ణుడు తాను చిన్నతనంలో వెన్నదొంగగా మారడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయట. పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న బయటకు వస్తుంది. అదే విధంగా మనసును భౌతిక ప్రపంచం నుంచి వేరు చేసేటప్పుడు మంచి మనసు బయటపడుతుంది. అంటే మంచి మనసు వెన్నలాంటి తెలుపైనదని అర్థం. ఇలాంటి మనసును శ్రీకృష్ణుడు దొంగిలించేవాడని చెబుతూ ఉంటారు. మన హృదయాల్లో ఎన్నో భావాలుంటాయి. ఇందులో ప్రేమతో పాటు ద్వేషం, ఈర్ష్య, అసూయ వంటివి కూడా ఉంటాయి. వీటిని పారద్రోలి మనసులందరిని ఒక్కటి చేయాలన్నదే శ్రీకృష్ణుడి ఉద్దేశం.

శ్రీకృష్ణుడు వెన్నను తన స్నేహితులతో కలిసి దొంగిలిస్తాడు. స్నేహితుల మధ్య ఐక్యతను చాటి చెప్పడానికి ఇలా చేస్తాడు. అలాగే వారిలో శారీరక బలం పెంచి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగల శక్తిని కలిగిస్తాడు. ఇందులో భాగంగానే శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాడలో ఉన్నవాళ్లంతా ఒక్కచోట చేరి ఐకమత్యంగా ఉట్టి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలా శ్రీకృష్ణుడు చేసే ప్రతి పనిలో పరమార్థం దాగి ఉంది.

స్నేహితులతో కలిసి గొల్లవారి ఇళ్లల్లో వెన్నను దొంగిలించడం వల్ల ఆయనను వెన్నదొంగ అంటారు. తల్లి యశోదకు గారాల పుత్రుడు కాబట్టి కన్నయ్య అంటారు.. ఇలా రకరకాల పేర్లలో కూడా గూడార్థం దాగి ఉందని కొందరు పండితులు అంటున్నారు. శ్రీకృష్ణుడి చెప్పిన మాటలు భగవద్గీత ద్వారా నేటి ప్రపంంచానికి అందిస్తున్నారు. అయతే కొందరు ఇలాంటి పరమార్థం తెలిసిన వారు తమ జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం వీటిని పాటించడం లేదు.

Leave a Comment