కోకోలా మ్యాగీ..ఎప్పుడైనా తిన్నారా?

స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి ప్రత్యేక స్థానముంది.. అందుకే ఎ రాష్ట్రం కు వెళ్ళినా కూడా మ్యాగికి మంచి డిమాండ్ వుంది.  కాగా కొన్ని రోజుల క్రితం ‘మ్యాగీ షర్‌బత్‌’ అంటూ ఓ వ్యాపారి నెటిజన్లకు చికాకు తెప్పించగా.. ఇటీవల తందూరీ మ్యాగీ అంటూ మరొకరు మ్యాగీపై విరక్తి తెప్పించారు. తాజగా ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి కూడా నీళ్లకు బదులు కోకాకోలా వేసి మ్యాగీని తయారుచేశాడు. దీనిపై కూడా నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘మీదేం టేస్టురా బాబూ’ అంటూ విసిగించుకుంటున్నారు..

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.తాజాగా భుక్కడ్ ఢిల్లీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ‘ కోకాకోలా మ్యాగీ’ తయారు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఈ వీడియోలో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి ముందుగా ఒక ప్యాన్‌లో నూనె, కూరగాయలను పోస్తాడు. ఆ తర్వాత ఉప్పు, కొన్ని మసాలా దినుసులు జోడిస్తాడు. అయితే ఇప్పుడు నీళ్లకు బదులు కోకా కోలా డ్రింక్‌ వేసి ఉడికిస్తాడు. ఆతర్వాత మ్యాగీ మసాలా జోడిస్తాడు. దీంతో కోకాకోలా మ్యాగీ తయారీ పూర్తవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ ప్లీజ్‌ ఇలాంటివి ఆపండి.. మ్యాగీ నాశనమైంది.. అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఆ దరిద్రం మీరు ఒకసారి చూడండి.

Leave a Comment