రాకేశ్ ఝున్ ఝున్ వాలా షేర్ మార్కెట్లో ఎలా ఎదిగారు..?

‘నాకు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టాలని ఉంది నాన్నా..’ అని ఓ కొడుకు తండ్రిని అడుగుతాడు.. అందుకు తండ్రి సమాధానమిస్తూ ‘షేర్ మార్కెట్లో డబ్బు పెట్టడానికి నన్ను, నీ స్నేహితులను డబ్బు అస్సలు అడగొద్దు’ అని చెప్పాడు.. దీంతో రూ.5 వేలతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో షేర్ రంగంలోకి దూకాడా ఆ కొడుకు.. ఆయన ప్రయత్నం ఫలించింది..తండ్రి చెప్పిన విధంగా ఎవరినీ డబ్బు అడగకుండా షేర్ మార్కెట్లోకి దూసుకెళ్లాడు. చివరికి 600 కోట్ల డాలర్లు (రూ.45,328 కోట్లు) వరకు సంపాదించాడు. షేర్ మార్కెట్ రంగంలో రారాజుగా మారిన ఆయనెవరో కాదు.. రాకేశ్ ఝున్ ఝున్ వాలా.. ఝున్ ఝున్ వాలా 14న ఆదివారం ఉదయం కన్ను మూశారు. రాకేశ్ మరణించిన మరుక్షణం నుంచి ఆయన పేరు మీడియాలో మారుమోగుతోంది. అంతేకాకుండా ఇటీవల ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఎవరు..? షేర్ రంగంలో ఎలా ఎదిగారు..? ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’ అని ఆయనను ఎందుకంటారు..?

1960 జూలై 5న రాకేశ్ ఝున్ ఝున్ వాలా ముంబయ్ లో జన్మించారు. ఆయన తండ్రి ఆదాయపు పన్ను శాఖాధికారి. దీంతో రాకేశ్ కు చిన్నప్పటి నుంచే షేర్ మార్కెట్ పై అవగాహన పెరిగింది. రోజంతా వచ్చే వార్తలతో షేర్ మార్కెట్ పై ఎలా ప్రభావముతుందో గమనించాలని చెప్పారట. దీంతో ఝున్ ఝున్ వాలా కు షేర్ మార్కెట్ పై మరింత ఆసక్తి పెరిగింది. చార్టెడ్ అకౌంట్స్ పూర్తి చేసిన తరువాత షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతానని రాకేశ్ తండ్రితో చెప్పాడట. అయితే షేర్లో డబ్బు పెట్టేందుకు ‘నన్ను నా స్నేహితులను డబ్బు అడగొద్దు’ అని కొడుకుతో కచ్చితంగా చెప్పారు. అంతేకాకుండా షేర్ మార్కెట్లో సక్సెక్ కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ గానే కొనసాగాలని కూడా అన్నాడు.

పట్టుదలతో రాకేశ్ రూ.5 వేల రూపాయలతో పెట్టుబడులు ప్రారంభించారు. 1986లో ఝున్ ఝున్ వాలా ఓ కంపెనీకి చెందిన 5వేల షేర్లు కొన్నాడు. ఒక్కో షేర్ ధ రూ.43. అయితే ఆయనకు వెంటనే అదృష్టం తలుపుతట్టిన్టలయింది. కేవలం మూడు నెలల్లోని ఆ షేర్ ఒక్కోటి రూ.143కు పెరిగింది. ఇక అక్కడితో ఝున్ ఝున్ వాలా విజయ పరంపర కొనసాగింది. ఇలా షేర్ల ద్వారా రాకేశ్ రూ.10,200 కోట్లు (రూ.7.70 లక్షల కోట్లు) సంపాదించిటనట్లు ఫోర్బ్స్ తెలిపింది. అయితే రాకేశ్ 13 ఏళ్ల వయసు నుంచే షేర్లు కొనడం ప్రారంభించారని అంటారు. కానీ అందుకు ఆధారాలు లేవు.

సాధారణంగా షేర్ మార్కెట్ ద్వారా సక్సెస్ అయిన వారు కొందరే. అయితే ఈ రంగంలో అత్యంత ఎత్తుకు ఎదిగిన రాకేశ్ ను ‘ఇండయిన్ వారన్ బఫెట్’అని పిలుస్తారు. కానీ అలా పిలవడం తనకు ఇష్టం లేదట. సంపద అయినా, విజయాలు అయినా పరికక్వత విషయంలో బఫెట్ నాకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నారు అని 2012లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ అన్నారు. నేను ఎవరికీ క్లోన్ కాదు. నేనొక రాకేశ్ ఝున్ ఝున్ వాలా మాత్రమే అని తన సంప్లిసిటీని ప్రదర్శించారు.

రాకేశ్ ఝున్ ఝున్ వాలా గతేడాది అక్టోబర్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ‘రాకేశ్ ను కలవడం చాలా సంతోషకరం’ అని ఆ సందర్భంగా మోదీ అన్నారు. అయితే అక్టోబర్ 11న ఝున్ ఝున్ వాలా కు భాగస్వామ్యం ఉన్న ‘ఆకాశ ఎయిర్’కు ప్రాథమిక అనుమతులు వచ్చాయి. దీంతో ‘ఆకాశ ఎయిర్’ అనుమతుల కోసమే ప్రధాని మోదిని కలిశారని కొందరు అన్నారు. కానీ అంతేకాకుండా రాకేశ్ కుర్చీలో కూర్చుండగా.. ప్రధాని మోదీ నిల్చొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విమర్శలు రాగా.. రాకేశ్ అనారోగ్యంతో వీల్ చైర్లో ఉన్నారని, మోదీ అతనిని పరామర్శిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Leave a Comment