ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్.. సెకండ్ మూవీ డిజాస్టర్.. తెచ్చుకున్న డైరెక్టర్లు వీరే..

సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలు కంటారు. కొందరు డైరెక్టర్లు కావాలని..మరికొందరు హీరోగా ఎదగాలని తాపత్రయపడుతుంటారు. అయితే డైరెక్టర్ కావడమంటే ఆషామాషీ కాదు. ఎంతో కష్టపడాలి. మంచి కథ ఉన్నా సినిమా తీసేందుకు నిర్మాత ఒప్పుకోవాలి. ఇలాంటి ఒడిదొడుకుల మధ్య సినిమా తీసినా సక్సెస్ కావాలి.. అప్పుడే అతడికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తుంటాయి. ఈ కోవకు చెందిన చాలా మంది డైరెక్టర్లు తమ కృషి, పట్టుదలతో సినిమాలు తీశారు. కొందరు ఎంత ప్రయత్నించినా దర్శకులుగా రాణించలేకపోయారు. కానీ మరికొందరు మాత్రం మొదటి సినిమాతో స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వీరికి సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ రెండో సినిమా డిజాస్టర్ తో మళ్లీ వారి పేరు వినిపించకుండా పోయింది. ఇలా మొదటి సినిమా హిట్టు కొట్టి.. రెండో సినిమా ఫట్టు అయిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం..

అజయ్ భూపతి:
అజయ్ భూపతి డైరెక్టర్ తీసిన మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ . ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే చూసేవాళ్లున్నారు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో డైరెక్టర్ అజయ్ భూపతి పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఇదే ఊపుతో ఆయన శర్వానంద్, సిద్దార్థలతో కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాను తీశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్టు అయితే అజయ్ కు మంచి గుర్తింపు ఉండేదని అనుకుంటున్నారు.

సుజీత్:
మైండ్ మ్యాజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘రన్ రాజా రన్’ సినిమా ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. శర్వానంద్, అడవిశేషు లు నటించిన ఈ సినిమాకు సుజీత్ డైరెక్షన్ చేశారు. అప్పటి వరకు ఏమాత్రం అంచనాలు లేని సుజీత్ పై ఈ సినిమా తరువాత భారీగా పెరిగాయి. దీంతో రెండో సినిమా ఏకంగా ప్రభాస్ తో తీసే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో ఆయన ప్రభాస్ తో కలిసి ‘సాహో’ తీశారు. అయితే ఈ మూవీ అటు ప్రభాస్ కు, ఇటు సుజీత్ కు నిరాశ తెప్పించింది.

కరణ్ కుమార్:
పాటలతో మత్తెక్కించిన ‘పలాస’ మూవీ ఇప్పటికీ దాని గురించి మరిచిపోరు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను కరణ్ కుమార్ తీశారు. మొదటి సినిమాతో హిట్టు కొట్టిన కరణ్ కుమార్ ఇదే ఊపుతో సుధీర్ తో కలిసి ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాను తీశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ మిగిలింది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో ‘మెట్రో కథలు’ అనే వెబ్ సిరీస్ ను కూడా తీశారు. కానీ అదికూడా పేరు తేలేకపోయింది.

తేజమార్ని:
జోహార్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన తేజ మార్ని ఆ తరువాత రెండు సినిమా ‘అర్జున పాల్గుణ’ తీశారు. కానీ ఈ సినిమా అనుకున్నంతగా రాణించలేదు. దీంతో మొదటి సినిమాకు వచ్చిన పేరు.. రెండు సినిమాకు తుడిచిపెట్టుకుపోయింది.

ప్రశాంత్ వర్మ:
‘ఆ’ అనే సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. యంగ్ టాలెంట్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండో సినిమా అగ్ర హీరో రాజశేఖర్ తో కలిసి ‘కల్కి’ తీశారు. కానీ అది డిజాస్టర్ అయింది.

Leave a Comment