పెళ్లిమండపంలో వరుడి స్నేహితులు చేసిన పనికి పెళ్లికూతురు షాక్..: ఏమన్నారో తెలుసా..?

స్నేహితుడి పెళ్లి అంటే ఎరికైనా సంతోషమే. కానీ చదువుకునే రోజుల నుంచి తమతో ఉన్న అతడు ఇక కలిసుంటాడో లేదో.. అనే బాధ కూడా ఉంటుంది. అయినా తమ ఫ్రెండ్ ఓ ఇంటివాడవుతున్నాడటంటే తమ ఇంట్లో పెళ్లి లాగా పనులు చేస్తారు కొందరు స్నేహితులు. ఆ పెళ్లి తంతు పూర్తయ్యే వరకు తమ స్నేహితుడిని ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇదే క్రమంలో అతనికి విలువైన బహుమతులు ఇస్తారు. అయితే కొందరు స్నేహితులు పెళ్లిమండపంలో తమ స్నేహితుడి జంటకు ఓ విచిత్రమైన ఆర్జీని పెట్టుకున్నారు. ఆ వినతిని చూసిన పెళ్లికూతురు షాక్ కు గురైంది. అంతేకాకుండా ఆక్కడున్న వారంతా ముందుగా షాక్ తిన్నారు. కానీ ఆ తరువాత ఆశ్చర్యపోయారు. ఇంతకీ పెళ్లికొడుకు స్నేహితులు ఏమని వినతి పత్రం ఇచ్చారు..?

హరిప్రసాద్ అనే వ్యక్తి మధురైకి చెందిన పూజ అనే అమ్మాయితో ఇటీవల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి హరిప్రసాద్ స్నేహితులంతా వచ్చారు. వీరంతా బాల్యం నుంచి కలిసున్నారు. వీరు కలిసి చదువుకోవడమే కాకుండా క్రికెట్ ఆటగాళ్లు కూడా. ప్రస్తుతం హరిప్రసాద్ తేనిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. హరిప్రసాద్ పెళ్లితో క్రికెట్ కు దూరమవుతాడని ఆయన స్నేహితులు ఆందోళన చెందారు. పెళ్లయిన తరువాత ఏ భార్య అయినా క్రికెట్ ఆడడం అంటే ఒప్పుకోందు. అందువల్ల స్నేహితులంతా కలిసి పెళ్లి కూతురుకు ఓ వినతి పత్రం ఇచ్చారు. అదీ బాండ్ పేపర్ పైనా..

స్నేహితులందా పెళ్లి మండపం వేదికపైకి వచ్చారు. అక్కడ వారు పెళ్లికూతురుతో ఇలా మాట్లాడారు. శని, ఆదివారాలు హరిప్రసాద్ ను క్రికెట్ ఆడడానికి ఒప్పుకోవాలని కోరారు. అయితే ఇదివరకు కొందరు అలాగే అడగగా పెళ్లి కూతుళ్లు ఒప్పుకొని ఆ తరువాత అనుమతించలేదు. దీంతో ఈసారి వారు 20 రూపాయల బాండ్ పేపర్ పై రాసుకొని వచ్చి దానిపై సంతకం చేయాలని షరతు విధించారు. మొదట షాక్ తిన్న ఆ వధువు ఆ తరువాత ఆశ్చర్యపోయి నిరభ్యంతరంగా సంతకం చేసింది.

ఇంతకీ బాండ్ పేపర్లో ఏముందుంటే..? ‘నా భర్త సూపర్ స్టార్ క్రికెట్ జట్టు కెప్టెన్ హరిప్రసాదద్ ను శని, ఆది వారాల్లో క్రికెట్ ఆడేందుకు నేను అనుమతిస్తున్నాను.’ అని ఉంది. ఆ తరువాత ఈ విషయం తెలిసిన అక్కడున్న వాళ్లంతా నవ్వుకొన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ స్నేహితుల్లో రాజుకుమార్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ గతంలో కొందరు చాలా మంది క్రికెట్ ను ఆడేందుకు అనుమతి ఇచ్చారని, అయితే ఆ తరువాత ఒప్పుకోలేదని అన్నారు. అందుకే ఈసారి బాండ్ పేపర్ తో పకడ్బందీగా వచ్చామని తెలిపారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా.. సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారింది.

Leave a Comment