తాళి కడుతున్న వరుడిని కత్తితో పొడిచిన వధువు..!

నేటి సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాసేపు మన కళ్ల ముందు మంచిగా ఉన్నవారు ఆ తరువాత ఒక్కసారిగా చెడ్డవారవుతున్నారు. ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడడానికి చాలా సమయం పడుతుంది. కానీ విడిపోవడానికి క్షణమైనా పట్టడం లేదు. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకునే కొన్ని జంటలు అంతకుముందు ప్రేమించుకుని సరదాగా గడుపుతారు. కానీ తాళి కట్టించుకున్న తరువాత వారి మనసులు మారిపోతున్నాయి. జీవితాంతం కలిసుంటామని చెబుతూ చిన్న చిన్న కారణాలతోనే విడాకుల కోర్టు మెట్లెక్కుతున్నారు.

కొందరు యువతులు తాను పెళ్లి చేసుకోబోయే యువకుడు మంచివాడా..? చెడ్డవాడా..? అనేది పెళ్లికి ముందు తెలుసుకోవడం సాధ్యం కావడం లేదు. పెళ్లి తరువాత అసలు విషయం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి మండపానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తనతో జీవితాంత కలిసుండబోయే వ్యక్తి చెడ్డవాడని అప్పుడే తెలుస్తుంది. అందులో భాగంగా ఆ యువకుడిని అంతం చేయాలని చూస్తోంది. ఇలా ఓ పెళ్లికూతురు ఓ వైపు తాళి కట్టించుకుంటూనే.. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తితో పెళ్లికొడుకుపై దాడి చేస్తుంది. ఇదంతా చూసిన వారు షాక్ కు గురయ్యారు.

ఆ యువతి పెళ్లి కొడుకును కత్తితో పొడవడానికి కారణమేంటి..? అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఇందులో ఉన్నది నిజం కాదు. కేవలం వైరల్ కావడానికే షూట్ చేశారని తేలింది. షూటింగ్ లో భాగంగానే పెళ్లి సెటప్ వేశారు. రియల్ పెళ్లి లాగే పురోహితుడు పెళ్లి మంత్రాలు చదువుతాడు. అయితే తాళి కట్టమని వరుడికి చెప్పగానే అతడు లేచి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేందుకు రెడీ అవుతాడు. ఇంతలో యువతి కత్తితో పెళ్లి కొడుకులో దించుతుంది. అంటే యువతులు ఎంత సున్నిత మనస్కులో తప్పు విషయంలో అంత కఠినంగా ఉంటారని చెప్పడానికి ఈ వీడియో తీసినట్లు అర్థమవుతోంది.

కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు బాగా తీస్తున్నారు. అయితే సరదాగా తీసుకుంటే ఓకే.. కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగుతే మాత్రం జీవితలు నాశనం అవుతాయని కొందరు అంటున్నారు. మరికొందరు యువకులు ఫ్రాంక్ పేరిట మరీ దిగజారుతున్నారు. రోడ్డుపై వెళ్లేవారిని భయభ్రాంతులకు గురి చేస్తే వారి చేత విమర్శలు తింటున్నారు. అయితే అవన్నీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు తీస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment