చిన్నప్పటి ఈ పాప… ఇప్పుడు పెద్ద హీరోయిన్..: ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సాధించిన హీరోయిన్లు చాలా తక్కువ. ఎన్నో రోజులకు గానీ వారికి గుర్తింపు వచ్చేది కాదు. కానీ అందంతో పాటు అభినయం, ఇతర కళల్ని నేటి యువతులు వెంటనే నేర్చుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో అవకాశం దొరికిందే తరువాయి వెంటనే తమ ప్రతిభను చూపుతున్నారు. ఇక మరో రకం యువతులు చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటనలో మెళకువలు నేర్చుకుంటున్నారు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక కెమెరా ముందు నటించడం వారికి తేలికవుతోంది. ఇలా కొన్ని సినిమాల్లోనే నటించి పెద్ద స్టార్లుగా మారిన వారు ఉన్నారు. అలాంటి వారిలో హన్సిక ఒకరు. హన్సికకు సంబంధించిన లెటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

actress hansika

‘కోయి మిల్ గయా’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన హన్సిక ఆ తరువాత చదువుపై దృష్టిపెట్టింది. పెరిగి పెద్దయ్యాక కూడా సినిమాల్లో రావాలనే ఆశ అమ్మడుకు లేదట. అయితే డేరింగ్ డ్యాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హన్సికను చూసిన తరువాత తన సినిమాలో పెట్టుకోవాలని అనుకున్నాడట. దీంతో తెలుగులో ‘దేశముదురు’ సినిమాలో హన్సికను తెలుగులో పరిచయం చేశాడు పూరి. ఇక మొదటి సినిమాను మోగా హీరోతో నటించే చాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అవకాశాల కోసం వేచి చూడకుండానే ఇంటి తలుపు తట్టాయి.

hansika

తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో నీలికళ్ల పాపకు బోలెడు అవకాశాలు వచ్చాయి. అయితే మిగతా ఇండస్ట్రీలో బిజీ అయిన భామకు తెలుగులో మాత్రం అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్ తో కలిసి కంత్రి, ఇతర సినిమాలో ఆశించిన విజయం సాధించలేదు. దీంతో హన్సిక గురించి ఎవరూ పట్టించుకోలేదు. వీటికి తోడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అమ్మడుకు మైనస్ గా మారింది. ఇలా కొన్ని రోజుల పాటు వెండితెరపై కనిపించలేదు.

hansika latest

సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో అలరిస్తూ ఉంటోంది హన్సిక. హాట్ హాట్ ఫొటోలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తరువాత హన్సిక లెటెస్ట్ ఫొటోస్ లో కాస్త హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. కొంచెం హాట్ గా.. మరికొంచెం లెటేస్టుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హన్సిక ఫొటోలను చూసిన కుర్రకారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment