గవర్నమెంట్ నే వణికించిన అమ్మాయి ఫొటో షూట్..

సాధారణంగా పెళ్లి చేసుకునేవారు సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు. పరిశుభ్రమైన ప్రదేశాలను ఎంచుకొని వారి వేడుకను నిర్వహించుకుంటారు. అంతేకాకుండా పెళ్లిలో దిగిన ఫొటోలో జీవితాంతం గుర్తిండిపోయేలా ఉంటాయి కాబట్టి అందంగా తయారవుతారు. అయితే ఈ మధ్య ఫ్రీ వెడ్డింగ్ షూట్ కు అలవాటు పడిన చాలా మంది యువతీ యువకులు దానిని కంపల్సరీ చేశారు. పెళ్లి చేసుకునే ప్రతీ ఒక్కరూ ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించుకుంటున్నారు. ఇందు కోసం మంచి ప్రదేశాలను వెతుక్కుంటున్నారు. కానీ ఓ అమ్మాయి మాత్రం వింత ప్రదేశాన్ని ఎంచుకుంది. పెళ్లి బట్టలతో అక్కడ ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. అంతేకాకుండా గవర్నమెంట్ నే వణికించింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

కేరళకు చెందిన ఓ యువతి ఇటీవల పెళ్లి చేసుకుంది. అందరిలాగే తాను కూడా ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొంది. అయితే ఆమె ఫొటో దిగింది అందమైన ప్రదేశంలో కాదు. గుంతలు పడిన రోడ్డులో. తమ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ గుంతలుగా ఉన్నా రోడ్ల పక్కన నిల్చొని ఫోజులిచ్చింది. వీరి పెళ్లి ఫోటోలను ప్రముఖ ఫొటో స్టూడియో యారో కంపెనీ ఆమె కోరిక మేరకు సోషల్ మీడియాలో ఉంచింది. కొన్ని ఫొటోలతో పాటు ఓ వీడియోను కూడా అప్లోడ్ చేసింది.

అయితే ఈ వీడియోకు విపరీతమైన స్పందన లభించింది. దాదాపు 43 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా వధువు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారు. ఆమె వివరాలు ఏమీతెలియనప్పటికీ కేరళలో ప్రతీసారి వర్షం పడినప్పడు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. అందుకే వర్షం పడిన తరువాత గుంతలుగా ఉన్న రోడ్లపై ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని సూచించిందట.

ఆ యువతి కోరిక మేరకు కేరళ ప్రభుత్వం స్పందించింది. వెంటనే రోడ్ల బాగు కోసం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆమె వెడ్డింగ్ షూట్ ఫొటోతో గవర్నమెంట్ ను వణికించడపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలా సమాజం గురించి ఆలోచించాలని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పిచ్చి ఫోజులు పెట్టే బదులు ఇలా సమస్యలు ఉన్న వద్ద దిగి బయటి ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నారు.

Leave a Comment