‘క్విట్ ఇండియా ఉద్యమం’ ఎలా ప్రారంభమైంది..?

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలను విడిచిపెట్టడంతోనే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అయితే స్వాతంత్ర్యం రావడానికి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాగాయి. ఇందులో చివరిది ‘క్విట్ ఇండియా ఉద్యమం’. ‘డూఆర్ డై’ నినాదంతో మహాత్మగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు దేశం మొత్తం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది. దీంతో భారతీయు ఆకాంక్షను తెలుసుకున్న ఆంగ్లేయులు మొత్తానికి ఈ ఉద్యమం అంతంలో భారతదేశాన్ని విడిచిపెట్టారు.అసలు క్విట్ ఇండియా ఉద్యమం ఎలా ప్రారంభమైంది…? ఇందులో ప్రజలు ఎలా పాల్గొన్నారు..?

‘డూ ఆర్ డై’(విజయమో.. వీర మరణమో’ అన్న నినాదం ప్రజల్లో పాతుకుపోయింది. 1942 ఆగస్టు 8వ తేదీ సాయంత్రం ముంబయ్ లోని గోవాలియా టేంక్ మైదానంలో లక్షలాది మంది భారతీయులు చేరారు. వీరిలో ఒకరైన మహాత్మగాంధీ తన పిడికిలి బిగించి ‘కరో యా మరో’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఈ నినాదం ప్రజల్లో ఉత్సాహాన్ని రెకెత్తించింది. అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అయితే ఈ సభ నిర్వహణకు ముందు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నినాదం తీసుకోవడానికి ఎన్నో చర్చలు జరిపారు. అంతకుముందు ఏం జరిగిందంటే..?

1942 జూలై 14న వార్దాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని అప్పటించేవరకు పోరాడాలి అని తీర్మానించారు. వెంటనో ఆగస్టు 7న మరోసారి వర్కింగ్ కమిటీ బొంబాయ్ లో సమావేశం నిర్వహించింది. 8న జరిగిన మరో సమావేశంలో ‘క్విట్ ఇండియా ఉద్యమం’ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్నే గోవాలియా మైదానంలో జరిగిన సభలో ప్రకటించారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, నెహ్రు, ఆ తరువాత పటేల్ ప్రసంగించి ‘క్విట్ ఇండియా ఉద్యమం’ తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే ‘క్విట్ ఇండియా ఉద్యమం’ కోసం గాంధీజీ చాలా మందిని సంప్రదించారు. ఈ నినాదంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘రిట్రీట్ ఇండియా’, ‘విత్ డ్రా ఇండియా’ లాంటి నినాదాలు సూచించారు. కానీ వాటికి ఆమోదం లభించలేదు. కాంగ్రెస్ సభ్యుడు యూసఫ్ మహర్ అలీ నుంచి ‘క్విట్ ఇండియా’ పేనును సూచించడంతో గాంధీజీ వెంటనే ఆమోదించారు. అంతకుముందు పాపులర్ అయినా ‘సైమన్ గో బ్యాక్’ నినాదం కూడా యూసఫ్ మహర్ అలీ ఇచ్చిందే. అప్పుడు యూసఫ్ అలీ బొంబాయి నగర మేయర్ గా పనిచేస్తున్నారు.

‘క్విట్ ఇండియా’ ఉద్యంలో ప్రజల్లోకి వెళ్లింది. దీంతో ప్రతి ఒక్కరు స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి ముందుకు వచ్చారు. ఉద్యమ తీవ్రతను చూసి బ్రిటిష్ ప్రభుత్వం నాయకులను అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. గాంధీతో సహా గోవాలియాలో ప్రసంగం చేసిన నేతలందరినీ జైళ్లో పెట్టారు. ఈ సమయంలో మహాత్మగాంధీ ఇచ్చిన పిలుపుకు పాండురంగ సదాశివ్ సానే (సానే గురుజీ) ఆకర్షితులయ్యాడు. ఈయన సతారా, ఖాందేశ్ ప్రాంతాలకు వెళ్లి కార్యకర్తలతో రహస్య సమావేశాలు నిర్వహించేవారు. వేషాధారణతో అండర్ గ్రౌండ్ కు వెళ్లి వివిధ కార్యకలాపాలు నిర్వహించేవారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఇతని కార్యకలాపాలు కనుక్కొని అరెస్టు చేసింది.

Leave a Comment