ఏళ్లుగా భార్య శవం పక్కనే నిద్రపోతున్న భర్త..! ఎందుకో తెలుసా..?

ఒక వ్యక్తికి జీవితాంతం తోడుండేది భార్య లేదా భర్త మాత్రమే. అలాంటి పవిత్ర బంధానికి నేటి యువత విలువ ఇవ్వడం లేదు. అగ్నిసాక్షిగా ఒక్కసారి పెళ్లి చేసుకుంటే కష్ట,నష్టాలు ఎదురైనా కలిసుంటేనే అసలైన జీవితం. అయితే కొందరు చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్నారు. ఇలాంటి వారు కొందరే ఉండగా..మరికొందరు మాత్రం తన భార్య లేదా భర్త కోసం ప్రాణాలు విడిచే వారూ ఉన్నారు. అంతేకాకుండా విధి వికృతంగా మారి తన తోడును తీసుకెళితే వారి కోసం జీవితాంతం ఒంటరిగా ఉన్నవారూ ఉన్నారు. ఇక్కడ ఓ వ్యక్తి భార్య మరణించినా ఆమెతో కలిసి రోజూ నిద్రిస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ స్టోరీ ఏంటో తెలుసుకోండి..

పెళ్లితో ఒక్కటైన ఆ జంట జీవితాంత కలిసుండాలని అనుకుంది. కానీ విధి వారికి విలన్ గా మారింది. లీవ్ అనే వ్యక్తికి 1975లో పెళ్లయింది. వీరు చిన్న వయసులో ఉండగానే స్నేహం కుదిరింది. ఆ తరువాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువావ అన్యోన్య దంపతులుగా మారారు. ఏడుగురు పిల్లలను కన్న వీరు వారితో కలకలం కలిసుండాలని అనుకున్నారు. ఇలా సంతోషంగా జీవిస్తున్న వీరి జీవితంలో ఓ విషాదం ఏర్పడింది.

లీవ్ సైన్యంలో పనిచేస్తున్నాడు. 2003లో విధుల్లో ఉండగా ఆయనకు ఓరోజు ఛేదు వార్త వినిపించింది. ఆయన ఎంతగానే ప్రేమించే తన భార్య మరణించిందని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు. కానీ ఆయన ఇంటికి చేరేసరికి ఆలస్యమైంది. దీంతో తన భార్య ముహాన్ని ఎక్కువ సేపు చూడలేకపోయాడు. దీంతో ఆమెనుమట్టిలో పాతిపెట్టాడు. భార్యను వీడి ఉండలేక సమాధి పక్కనే నిద్రించాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాదు కదా..దీంతో భార్య సమాధి పక్కన సొరంగం తవ్వాడు. అయినా ఆయనకు తృప్తి కాలేదు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఆలోచన వచ్చింది.

తన భార్య సమాధిని తవ్వాడు. అందులో ఉన్న అస్తికలను ఓ సంచిలో వేసుకొని వెళ్లి ఇంట్లో పక్కన బెట్టుకొని నిద్రించాడు. కానీ అవి కుళ్లిన స్థితిలో ఉండడంతో వాటిని చూడలేక మథన పడ్డాడు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సిమెంట్, జిగురు ఇసుకల మిశ్రమంతో లీ తన భార్యలాగా ఉన్న బొమ్మను తయారు చేశాడు. తన భార్య ఆస్తికలను అందులో వేశాడు. అప్పటి నుంచి తన భార్య బొమ్మను బెడ్ ఉంచి ఆమె పక్కనే నిద్రపోతున్నాడు.

Leave a Comment