ఆరోజే ఐఫోన్ 14 రిలీజ్: మొబైల్ ప్రియుల ఫుల హ్యాపీ

మొబైల్ విప్లవంలో ‘ఐ’ ఫోన్ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. యాపిల్ కంపెనీ చెందిన ఐఫోన్ లెటేస్ట్ వర్సెన్ కోసం మొబైల్ ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐపోన్ 13 సిరీస్ నడుస్తోంది. త్వరలో ఐపోన్ 14 మార్కెట్లోకి రాబోతుందన్న ఆతృత అందరిలో అయితే మొన్నటి వరకు ఐఫోన్ 14 సిరీస్ సెప్టెబర్ 6న రిలీజ్ అవుతుందన్న వార్తలతో అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఫోన్ రిలీజ్ డేట్ ను మరో తేదీనికి మార్చారు. సెప్టెంబర్ 6న ట్రావెల్ డే ఉండడంతో ఆరోజు రిలీజ్ చేయడం లేదు. ఫైనల్ గా సెప్టెంబర్ 7న డిక్లేర్ చేసినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది.

ఐపోన్ 14 సెప్టెంబర్ 7న లాంచ్ అయినా ఆనెల 16 నుంచే విక్రయాలు జరుగుతాయి. అందువల్ల ఆ తేదీ వరకు వినియోగదారులు వెయిట్ చేయక తప్పదు. యాపిల్ నుంచి ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో, న్యూ మ్యాక్స్ లు కూడా అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఉండడం.. మరికొన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు ఇంకా అధికంగా ఉండడంతో ఈ ఏడాది కూడా లాంచ్ ఈవెంట్ ను ఆన్లైన్-ఓన్నలీగానే నిర్వహిస్తుందని యాపిల్ తెలిపింది.

ఐపోన్ 14 సిరీస్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నాలుగు మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 14, ఐపోన్ 14 మ్యాక్, ఐఫోన్ 14 ఫ్రో, ఐఫఓన్ 14 ఫ్రో మ్యాక్స్ లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ లో రెండు మొబైల్స్ వస్తున్నాయి. 6.1 ఇంచుల డిస్ ప్లే, మరో రెండు మోడళ్లు 6.7 ఇంచుల డిస్ ప్లేతో రానున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ మొబైళ్లు ఇప్పటికే ఏ15 బయోనిక్ చిప్ ఉండనుండగా.. ఐఫోన్ 14 ఫ్రో, 14 ఫ్రో మ్యాక్స్ లో లెటేస్ట్ ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ ను కలిగి ఉండబోతుంది.

ఫ్రో మోడల్స్ ప్రధాన కెమెరా 48 మెగా పిక్సెల్ సామర్థ్యంతో కలిగి ఉంటుందని అనుకున్నారు. కానీ 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 12 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ఈ సీరిస్ రిలీజై.. 13న యాపిల్ ఈవెంట్ ఉంటుందని బ్లూమ్ బర్గ్ కుచెందిన మార్క్ గుర్మన్ వెల్లడించారు. ఈ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ తో పాటు మిగతా మోడళ్లను కూడా పరిచయం చేస్తామని చెప్పారు.

Leave a Comment